calender_icon.png 31 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగరెయ్యాలే

31-01-2026 12:24:39 AM

ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి

ధర్మపురి,జనవరి30 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించి ధర్మపురి పట్టణాన్ని మరింత అభివృద్ది చేయడానికి అవకాశం కల్పించాలని మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, ధర్మపురి పట్టణం మరింత అభివృద్ది చెందాలంటే మున్సిపాలిటిపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఓటర్లను ఆయన కోరా రు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటితో గెలిపించాలనీ ఓట్లర్లను విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలు..!

ధర్మపురి పట్టణానికి చెందిన ఒడ్డెర యువజన సంఘం రాష్ట్రకార్యదర్శి ఓల్లెపు శంకర్ రాజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈకార్యక్రమంలో ధర్మపురి మండల, పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.