27-12-2025 01:02:46 AM
కేసముద్రం, డిసెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి సీనియర్, ఫాస్ట్ ఫైవ్ నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో రెండవ రోజు హోరాహోరీగా సాగాయి. రెం డవ రోజు క్రీడా పోటీలను మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ప్రారంభించారు. మహబూబాబాద్, మహబూబ్నగర్ జట్ల మధ్య నిర్వహించిన పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది. 19, 12 పాయింట్లతో మహబూబాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది.
ట్రెడిషనల్ విభాగంలో మహబూబాబాద్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. 20 పాయింట్లతో నారాయణపేట జట్టు రెండవ స్థానంలో నిలిచింది. నల్గొండ, మహబూబ్నగర్ చెరో ఆరు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాయి.
స్త్రీల విభాగంలో మే డ్చల్ మొదటి స్థానం, మహబూబ్నగర్ ద్వి తీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, నెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ సురేష్, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, ఎలేందర్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.