calender_icon.png 2 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితులను అరెస్టు చేసి శిక్షించాలి

02-12-2025 01:32:53 AM

నల్లగొండ కలెక్టర్‌ను కోరిన బీసీ జేఏసీ చైర్మన్ జాజుల 

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): నల్లగొండలో బీసీ అభ్యర్థిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసి, శిక్షించాలని జిల్లా కలెక్టర్‌ను సోమవారం బీసీ జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు.  వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో జన రల్ స్థానాలలో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులపై అగ్రకులాలు బెదిరింపులు, దౌర్జ న్యా లకు పాల్పడుతున్నాయన్నారు. 

అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెం దిన యాదగిరి యాదవ్‌ను అగ్ర కులాలకు చెందిన సందీప్‌రెడ్డి, ఇతన వ్యక్తులు కిడ్నాప్ చేసి హింసించారని,  దోషులను తక్షణమే అరెస్టు చేసి, శిక్షించాలని కోరారు. 24 గంటల్లోగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని వారిని శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామన్నారు. ఎల్లమ్మగూడేనికి చెందిన మిడి యాదగిరి  యాదవ్, నాగలక్ష్మి దంపతులకు ప్రభుత్వం  రక్షణ కల్పించాలని కోరారు.