29-01-2026 12:05:15 AM
నల్లగొండ టౌన్, జనవరి 28: కాంగ్రెస్ పాలనలో నల్లగొండలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కెసిఆర్ సహకారంతో మూడేళ్లలో నల్లగొండ పట్టణాన్ని 40 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధిజడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు అన్నారు. బుధవారం కంచర్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
పట్టణంలో రోడ్ల విస్తరణ, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఐటీ హాబ్ ఏర్పాటు చేశామని క్లాక్ టవర్ సెంటర్లో కళాభారతి కాంట్రాక్టర్ ను మంత్రి బెదిరించడంతో పనులు మొదలు పెట్టలేదని ఆరోపించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి తాను శంకుస్థాపన చేస్తే మంత్రి కులికేందుకు వాడుకుంటున్నారని విమర్శించారు. జిల్లాకు వచ్చే అనేకమంది అతిధుల కోసం గెస్ట్ హౌస్ ఉపయోగపడుతుందని భావించమన్నారు.
మట్టి, కంకర కాంట్రాక్టర్లను అవుటర్ రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించే డబ్బులు వసూలు చేసి స్కూలు భవన నిర్మించి మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రూ. 7 వేల కోట్లతో కెసిఆర్ ప్రభుత్వంలో మన ఊరి మనబడి ప్రారంభించగా వాటి నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని నేటికి వాటి బిల్లులను మంత్రి ఇప్పించలేదన్నారు. జిల్లాకు ఐకాన్ గా నిలిచే ఎన్జీ కాలేజీని 5వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన భవన నిర్మిస్తే నేటికీ ఆ భవనాన్ని ఎందుకు పూర్తి చేయలేదు చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యామంత్రిని అయితే కార్పొరేట్ స్కూలుని బంద్ చేయిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోడ్ల మంత్రి గాని ఏమీ చేయలేదని విమర్శించారు మంత్రి అనుచరులు చేస్తున్న విధ్వంసంని వెంచర్లను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు పార్టీలు మారేవారికి ఓటు వేయొద్దని ఓర్వలేక బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిని పదవ నుంచి తొలగించారని గుర్తు చేశారు.
బిఆర్‌ఎస్ పార్టీ నుండి 18 మంది కార్పొరేటర్లను ప్రకటించారు సిపిఎంతో కలిసి ఎన్నికల్లో వెళ్తున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ సీనియర్ నాయకులు కటిక సత్తయ్య గౌడ్ పంకజ్ యాదవ్ బక్క పిచ్చయ్య బొమ్మెరమైన నాగార్జున బక్క పిచ్చయ్య సింగం రామ్మోహన్ సహదేవరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు