09-02-2025 11:07:02 PM
ఎమ్మెల్యే జారే...
అశ్వారావుపేట (విజయక్రాంతి): ఉన్నత విద్యతోనే భవిష్యత్తుకు బంగారు బాటాలు ఏర్పడుతాయి అని, ప్రతి విద్యార్ధి సాదించాలనే పట్టుదలతో విద్యను అభ్యసించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట పట్టణంలోని జవహర్ విద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకులు శనివారం రాత్రి జరిగాయి. వేడుకులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిధిగా హజరుయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఓ వైపు ఉప్యాద్యాయడుగా, మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరింతగా ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాయన్నారు. తన పర్యటనలో ఎక్కడ పాఠశాల కనిపించినా అక్కడకు వెళ్లి పిల్లలతో గడుపుతానని తెలిపారు.
నియోజకవర్గంలో విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు. విద్యార్ధులు తమ గురువులు ఎక్కడ కనిపించిన రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలని, విద్యను బోధించిన గురువులను ఎన్నటికి మరువకుడదన్నారు. విద్యార్ధులు ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు. జవహర పాఠశాలలో చదివి వివిధ రంగాల్లో నిలిచినా పూర్వ విద్యార్ధులకు సన్మానం చేసారు. పాఠశాలలో విద్యలో తమ ప్రతిభను చూపిన విద్యార్ధులకు మొమొంటోలు ఎమ్మెల్యే చేతులు మీదుగా ప్రధానం చేసారు. అనంతరం పాఠశాల విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మైధిలి, కరస్పాడెంట్ ప్రవిణ్, ఎమ్‌ఇఓ ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.