30-01-2026 12:26:35 AM
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి
సనత్‌నగర్, జనవరి 29 (విజయక్రాంతి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, జీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఎస్‌ఆర్ నగర్ డివిజన్‌లో గురువారం పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాం గ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యం లో డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా, రవి కిరణ్ దేవులపల్లి, ఇతర డివిజన్ నాయకుల అధ్యక్షతన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బచావో సంగ్రామ్ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో బాపు నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో సచిన్ సావంత్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు.