calender_icon.png 31 January, 2026 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు అత్యాధునిక వైద్యం అందిచడమే లక్ష్యం

31-01-2026 12:00:00 AM

నిమ్స్‌ను సందర్శించిన డాక్టర్ శ్రీనివాస్ బొల్లినేని

ఖైరతాబాద్, జనవరి 30 (విజయక్రాంతి) : నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వి భాగం బలోపేతం దిశగా మరో ముందడుగు పడిం ది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్కు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్టర్న్ మెడికల్ సెంటర్ (యుటిఎస్ డబ్ల్యూ) ట్రాన్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ బొల్లినేని శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన నిమ్స్ వైద్య బృందంతో కలిసి ఊపిరితిత్తుల మా ర్పిడికి సంబంధించి శస్త్రచికిత్సకు ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అకాడెమిక్ చర్చలు నిర్వహించారు. ముఖ్యం గా క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సకు ముం దు రోగికి చేసే పరీక్షలు, సర్జరీ అనంతరం అందించే నిరంతర పర్యవేక్షణ, రోగి దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాల మెరుగుదలపై తన విలువైన అనుభవాన్ని పంచుకున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికి త్సా విధానాలను నిమ్స్‌లో అమలు చేయ డం ద్వారా రోగుల మనుగడ రేటును గణనీయంగా పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చల్లో భాగంగా ‘బహుశాఖల సమన్వయ విధానం’ (మల్టీ డిసిప్లినరీ అప్రోచ్) ప్రాముఖ్యతను డాక్టర్ బొల్లినేని నొక్కి చెప్పారు. శస్త్రచికిత్సకు ముందు రోగి శరీరాన్ని సిద్ధం చేసే ’ప్రిహాబిలిటేషన్’,ఆపరేషన్ తర్వాత త్వర గా కదలికలు (మొబిలై జేషన్) ప్రారంభించడం, ఊపిరితిత్తుల పునరావాసంలో ఫిజి యోథెరపీ పోషించే కీలక పాత్రపై ఆయన దిశానిర్దేశం చేశారు.

నిమ్స్, యుటిఎస్ డబ్ల్యూ మెడికల్ సెంటర్ మధ్య కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా జరుగుతున్న ఈ సందర్శన తెలంగాణలోని పేద రోగులకు అత్యాధునిక, సా క్ష్యాధారిత వైద్యం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని సదస్సుకు హాజరైన వైద్యులు అభి ప్రాయపడ్డారు.ప్రభుత్వ రంగంలో సంక్లిష్టమైన గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికి త్సలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిమ్స్ నిబద్ధతను ఈ సందర్శన మరోసారి చాటిచెప్పిందన్నారు.ఈ కీలక భేటీలో నిమ్స్ సివిటిఎస్ విభాగం అధిపతి డాక్టర్ అమరేశ్వర్ రావ్,పల్మనాలజీ నిపుణులు డాక్టర్ గోపాల్,ఫిజియోథెరపీ బృందం సభ్యులు పాల్గొన్నారు.