calender_icon.png 10 September, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

08-09-2025 01:20:47 AM

ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, సెప్టెంబర్ 7(విజయక్రాంతి): వచ్చే జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాచరణను రూపొందించామని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ లిబర్టీలో ని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ హైదరాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగిం ది. ఈ సమావేశంలో హైదరాబాద్ నగరం లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు డాక్టర్ దిడ్డి సుధాకర్ చెప్పారు.

ఇందులో భాగంగా మొదటి విడతలో 50వేల సభ్యత్వం చేయాలనీ నిర్ణయిం చామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యాలు, ప్రజలకు చేసే సేవలను పార్టీ నేతలు వివరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీని కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, దీని కోసం నాయకులూ బుర్ర రాము గౌడ్, అబ్దుల్ ముక్తాదిర్, విజయ్ మల్లంగిలతో కూడిన కమిటీ వేశామన్నారు.

త్వరలోనే ఈ కమిటీ సమావేశమై సభ్యత్వ నమోదు ఎలా చేయాలనే దానిపై నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కమిటీ జిహెచ్‌ఏంసి పరిధిలోని అన్ని ప్రాంతాలలో కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టి, ఆప్ ను బలోపితం చేసి వచ్చే జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలనీ నిర్ణయించడం జరిగిందన్నారు.

ప్రజాసమస్యలను పరిష్కరించడంతో పాటు పేదల పార్టీగా పేరొందిన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వం ప్రజలు, ముఖ్యం గా యువత  తీసుకోవాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో ఆప్ నగర నేతలు మహమ్మద్ మజీద్, హేమ సుదర్శన్ జిల్లోజు, సాదిక్, శివాజీ, రమ్య గౌడ్, ఎస్ ఎన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, దర్శనం రమేష్, అజీమ్ బైగ్, లియాఖత్ ఖాన్, ముక్తర్, తేజ లు పాల్గొన్నారు.