calender_icon.png 24 September, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ రహిత సమాజమే టీబీ ముక్త్ భారత్ లక్ష్యం

24-09-2025 12:00:00 AM

మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్

హుజూర్ నగర్, సెప్టెంబర్ 23 : క్షయ రహిత సమాజమే టీబీ ముక్త్ భారత్ లక్ష్యమని హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. మంగళవారం టౌన్ హాల్ లో చాతి ఎక్స్ రే శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు... క్షయవ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభించడం 2025 నాటికి దేశంలో క్షయవ్యాధి రహితంగా మార్చడం టీబీ ముక్త్ భారత్ లక్ష్యమన్నారు.

రెండు వారాలకు మించి దగ్గు, బరువు కోల్పోవడం తేమడలో రక్తజీరలు,రాత్రి వేళల్లో జ్వరం ఉన్నట్లయితే టీబీగా అనుమానించి వెంటనే పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా టీబీ పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నామని తెలిపారు.

వైద్య శిబిరంలో 105 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్లు శ్రీప్రియ,ఆష్రఫ్ , కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ నూర్జహాన్ బేగం,టీబీ కోఆర్డినేటర్ ప్రసాద్, మాధవరెడ్డి,ఆరోగ్య కార్యకర్తలు ఇందిరాల రామకృష్ణ,ఉదయగిరి శ్రీనివాస్, లలిత, మాధవి, మమత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.