17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి

24-02-2026 12:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 23:మున్సిపాలిటీలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలకవర్గం పని చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి  తెలిపారు. గడ్డపోతారం మున్సిపాలిటీ తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అవకాశం అతి కొద్ది మందికే లభిస్తుందని.. ప్రజలు అందించిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే ఐదేళ్లపాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు.

నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని..అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనా లని కోరారు.

మున్సిపల్ పరిధిలో గల హెట్రో పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వ అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తోందని..వెంటనే తొలగించేలా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేశారు.  ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా,  వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కమిషనర్ వెంకటరామయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.