calender_icon.png 29 May, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి

28-05-2025 12:19:19 AM

  1. ఉద్యమకారుల డిమాండ్ పరిష్కరించాలని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా
  2. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపోల్ రాంరెడ్డి

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాల ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి లబ్ది పొందని కళాకారులను సాంస్కృతిక సారధిలో వెంటనే తీసుకోవాలన్నారు. ఉద్యమకారుల, అమరుల కుటుంబాలకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు ఉచిత బస్సు పాసులు అందజే యా లని కోరారు. ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వా లన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు విద్యా, ఉద్యోగాలలో, రాజకీయాల్లో 2 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇళ్ళు నిర్మిం చి ఇవ్వాలన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 30,000 గౌరవ వేతనాన్నిప్రతి నెల ఇవ్వాలని కిడ్నాప్ చేశారు. ఉద్యమకారులు ఆర్థిక, సామాజిక, మానసికంగా, వయస్సులు పెరిగి అన్ని రకాలుగా నష్టపోయినారు. చేసుకునే వృత్తి, పనులు పోయినా యి. కనుక వారికి 50% సబ్సిడీతో కూడిన కోటి రూపాయాలు వ్యాపారం నిమిత్తం ఆర్థిక సహాయం ప్రభత్వమే నేరుగా అందించాలన్నారు. తెలంగాణ ప్రతి జిల్లాలోని అమరులైన ఉద్యమకారులకు స్మారక భవ నం నిర్మించాలన్నారు.

అమరవీరుల స్మృతి వనంను 100 ఎకరాలలో ఏర్పాటు చేయాలని కోరారు. మలిదశలో అమరులైన 1200 మందిలో కొందరికి సహాయం గత ప్రభుత్వం చేయగా మిగిలిన కుటుంబాలకు 10 లక్షల నగదు, ప్రభుత్వఉద్యోగం ఇవ్వాలి. తొలిదశ ఉద్యమకారులకు కూడా ఆర్థిక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి  చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య,  కృష్ణాధర్, వైస్ చైర్మన్లు తుల్జా రెడ్డి, అన్వర్ పటేల్, పద్మ, సుజీ, మాధవి, ధనలక్ష్మి భువనగిరి లావణ్య, చెరుకు సుధాకర్, లక్ష్మీకాంతమ్మ, శ్రీశైలం, అంజలి కుమా రి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.