calender_icon.png 30 January, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల సమగ్రాభివృద్ధ్దే ప్రభుత్వ లక్ష్యం

30-01-2026 12:35:01 AM

మిర్యాలగూడ, జనవరి 29: దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే గ్రామాల సమగ్రాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బి ఎల్ ఆర్ ) అన్నారు. గురువారం మిర్యాలగూడ మండలం లావుడి తండ గ్రామంలో రూ.20 లక్షల  ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన  గ్రామపంచాయతీ నూతన  భవనాన్ని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సర్పంచ్ లావుడి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులను ప్రణాళిక బద్ధంగా వినియోగించుకొని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

తదుపరి ఆయన గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు  స్కైలాబ్ నాయక్, ఉప సర్పంచ్ ధనావత్ కృష్ణ, ఎంపీడీవో శేషగిరి శర్మ, పి ఆర్ ఏ ఈ వరలక్ష్మి, ఎంపీ ఓ మాతంగి రమేష్, పంచాయతి కార్యదర్శి బంటు వాణి, తుంగపాడు సర్పంచ్ వెంకటరెడ్డి, నాయకులు కంచు గట్ల లింగ యాదవ్, సూది రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.