30-01-2026 12:34:16 AM
నకిలీ వైద్యుడు రిమాండ్
మేడిపల్లి, జనవరి 29 (విజయక్రాంతి): వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డెయిరీ ఫారం వ్యాపారం చేసే పీ.ఎల్లం (56) సోమవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా అతని భార్య మేడిపల్లిలోనే ఆర్‌ఎంపీ వైద్యుడు వద్దకు తీసుకెళ్ళింది. వైద్య పరీక్షల అనంతరం రెండు ఇంజక్షన్లు ఇవ్వగా వెంటనే ఎల్లం నోట్లో నుంచి నురగలు రావడం తో, గమనించిన భార్య భయంతో ఈ విషయాన్ని కుమారుడు నాగరాజుకు తెలియజేసింది.
అనంతరం బాధితు డిని బోడుప్పల్‌లోని కేకే స్వర హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అదే రాత్రి ఎల్లం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతిని కుమారుడు నాగరాజు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయ గా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దీంతో విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. లునావత్ రూప్ సింగ్ నకిలీ వైద్యుడు అని, అతడు డాక్టర్ చదివినట్లు ఎలాంటి అర్హత పత్రాలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు తేలిం ది. ఈ మేరకు పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.