calender_icon.png 5 September, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోషులను వదిలిపెట్టకూడదు

01-09-2025 02:26:33 AM

  1. ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్ తరాలకు కనువిప్పు కలగాలి

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని 

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టుపై  ఇచ్చిన రిపోర్టుపై న్యాయ సలహా తీసుకుని దోషులను ఎవరినీ వదిలిపెట్టకూడదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. దీంతో భవిష్యత్ తరాలకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు దగా, నియామకాలు దగా, నిధుల ఎంతో దగా దీనిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

యూపీ, బీహార్‌లో అరాచకత్వం గురించి వినేవాళ్లమని, దురదృష్టకరంగా తెలుగు రాష్ట్రాల్లోనూ గత పదేళ్లుగా చూస్తున్నామని తెలిపారు. ఇది కేవలం రాజకీయ నాయకులకే ఇది పరిమితం కావడం లేదని, సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా ఉంటుంది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా తయారైందన్నారు.  వారి అభిప్రాయం చెప్పడానికి స్వేచ్ఛ లేదు.. వినడానికి ఓపిక లేదన్నారు.