calender_icon.png 4 July, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో రగులుతున్న స్థానిక సంస్థల వేడి

03-07-2025 02:35:47 AM

-సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ 

-పాగా వేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు పోతున్న భారతీయ జనతా పార్టీ 

-స్థానిక సంస్థల్లో తీవ్రంగా  నష్టపోనున్న బీఆర్‌ఎస్ 

-పోటీకి మొగ్గు చూపని గులాబీ శ్రేణులు 

నిజామాబాద్ జూలై 2: (విజయ క్రాంతి); నిజామాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సంక్షేమ పథకాలు రైతుల కై అధిక మొత్తంలో నిధులు విడుదల చేయడం ఆ పార్టీ నాయకుల విస్తృత పర్యటనలు ఈ వాదనలకు బలం చేకూరుతోంది. ఇటీవల జిల్లా పర్యటనలో మంత్రులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ప్రకటనలు చేయడం ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.

ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులకు నాయకులను నియమిస్తూ పార్టీ పదవుల లో క్యాడర్ను నియమించారు. కానీ కొందరు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు గుర్తించిన పార్టీ క్యాడర్ తమకు ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని పదవులు వద్దు అని కరకండిగా చెబుతున్నారు. ఎట్టకేలకు స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్న సాంకేతాలకు అనుగుణంగా క్యాడర్ పథకాల ఆచరణ తో స్థానిక గాను గ్రామాలలో పట్టణాలలో రాజకీయ వేడి పెరుగు పెరుగుతోంది. ఈనెల చివరిలో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే నెల ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది.

పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి దాదాపుగా సంవత్సరంనర కావస్తున్నప్పటికీ జడ్పీ మున్సిపాలిటీల గడువు ముగిసి ఆరు నెలల గడిచిన విషయం విధితమే ఎంపీపీల పదవుల కాలం ముగిసి దాదాపుగా ఏడాది కావస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సాంకేతాలు వెలువడుతున్న తరుణంలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు బిజెపి నాయకులు. వ్యూహాత్మ కంగా అమితుని తేల్చు కోవడానికి సిద్ధమవుతున్నారు.

ఆర్మూర్ నిజామాబాద్ లలో బిజెపి ఎమ్మెల్యేలు ఇద్దరు ఉండగా పట్టణాలతో పాటు గ్రామాలలో పట్టు సాధించడానికి పక్కా ప్రణాళికతో బిజెపి ముందుకు వెళ్తోంది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్మూర్ బోధన్ మేజర్ మున్సిపాలిటీ తోపాటు జిల్లాలో గ్రామపంచాయతీలలో సర్పంచ్ స్థానాలను గెలుచు కొని పక్క ప్రణాళికను బిజెపి విహాత్మకంగా చేపడుతోంది. ఈ విషయమై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎమ్మెల్యేలు కేంద్ర రాష్ట్ర పదవులలో ఉన్న న్యాయకత్వంతో సమీక్షలు సమావేశాలు అత్యంత గోపి అన్న నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉన్న తప్పకుండా గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలు చేజ్ ఎక్కించుకుంటామని ధీమాతో ఉన్నారు.

మరోవైపు పార్టీని వదులుతున్న క్యాడర్ ని ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో గులాబీ శ్రేణులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గెలుపు సునాయాసంగా ఉంటుందన్న ఆశ కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది సన్న బియ్యం సరఫరా ఇళ్ల పట్టాల పంపిణీ ఇందిరమ్మ ఇల్లు భూభారతి చట్టం రైతు భరోసా వంటి పథకాల తో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారు అన్న ధీమాతో కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ను ధీతుగా ఎదుర్కొని నిజామాబాద్ జిల్లాలో పట్టు సాధించే దిశగా పట్టణ గ్రామాలలో బిజెపి శ్రేణులు అనుబంధ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతోంది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి యాగమ్య గోచరంగా మారింది. గతంలో జిల్లాలో కేవలం కను సైగలతో అంతా చక్కబెట్టే మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల దృశ్య ఆ పార్టీ గందరగోళ పరిస్థితిలో ఉంది అసలు పార్టీలో ఏం జరుగుతోంది అనే స్పష్టత లేకుండా పోయింది. భవిష్యత్తులో బి ఆర్ ఎస్ నుండిపోటీకి ఆ  అభ్యర్థులు కూడా ముఖం చాటేసే పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు టిఆర్‌ఎస్ పార్టీకి ఊహించని గనష్టం కలిగించే విధంగా కనిపిస్తోంది.