calender_icon.png 26 January, 2026 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న కొనుగోళ్ల అవకతవకల్లో కదులుతున్న డొంక

26-01-2026 01:21:15 AM

విచారణ చేపట్టిన సహకార శాఖ అధికారులు 

మహబూబాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెం మక్కల కొనుగోలు కేంద్రంలో జరిగిన ఆవినీతి ఆక్రమాలపై వచ్చిన వార్తా కథనాలు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశించడంతో జిల్లా సహకార శాఖ అధికారులు శనివారం వారం నుంచి విచారణ మొదలు పెట్టారు.

విచారణాధికారిగా సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ను నియమించగా శనివారం శ్రీనివాస రా వు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మర్రిగూడెం, మహాదేవుని గూడెం తదితర గ్రామాలకు చెందిన ఆదివాసి రైతులు విచారణాధికారికి కొనుగోలు కేంద్రంలో జరిగిన ఆక్రమాలపై పూస గుచ్చినట్లు వివరించారు.

రైతులు ఆరోపించినట్లుగా అక్రమాలు జరిగాయో లేదో తెలుసుకోవడానికి కొనుగోలు కేంద్ర నిర్వాహకుడి నుంచి మొక్క జొన్నల కొనుగోలుకు సంబందించిన రికార్డులను స్వాదీనం చేసుకొని, వాటిని పొగుళ్ల పల్లి పి ఏ సి ఎస్ కు తరలించి రైతులు ఆరోపించిన విధంగా అక్రమాలు జరిగాయో లేదో పరిశీలించగా విస్తూపోయే అంశాలు వెలుగు లోకి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు రైతులు ఆరోపిస్తున్నట్లుగా సదరు కొ నుగోలు కేంద్రం నిర్వాహకుడు తన నమ్మకస్తుల పేరుమీద రైతుల వద్ద నుంచి ఆక్రమం గా తూకం వేసిన మొక్కజొన్నలను వివిధ వ్యక్తుల పేరుమీద ట్రక్ షీట్ల లో నమోదు చే సినట్లుగా విచారణలో గుర్తించారని తెలిసిం ది.

సదరు కొనుగోలు కేంద్ర నిర్వాహకుడి సోదరుడి పేరు మీద 286 బాస్తాలను అక్రమంగా నమోదు చేశారని, ఇవే కాకుండా ఇ ప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు 800 పైచిలుకు బస్తాల మొక్కజొన్నలను అ క్రమంగా నిర్వాహకుడు తన అనుయాయు ల పేరు మీద ట్రక్ షీట్లలో నమోదు చేసి అ ట్టి నగదును వారి ఖాతాల్లోకి మళ్ళించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. 

ఆక్రమాలపై విచారణ జరుపుతున్నాం

మర్రిగూడెం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు రైతులు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వమన్నారని తమ శాఖ ఉన్నంతధికారి ఆదేశం మేరకు తాను గత రెండు రో జులుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల వ ద్దనుంచి వివరాలు సేకరించినట్లు విచారణ అధికారి, సహకార శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

రైతుల నుంచి ఆధారాలతో సహా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించామని, వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించి సమగ్రమైన నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తానని ఆయన తెలిపారు.విచారణలో ఆక్రమాలు జరిగినట్లు తెలీతే సదరు నిర్వాహకుడి నుంచి రైతులకు చెందాలిసిన సొమ్మును వారికి ఇప్పించడంతో పాటు శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు వెంట పొగుళ్ల పల్లి పి ఏ సి ఎస్ సి ఇ ఓ లు పెద్ద వెంకన్న, చిన్న వెంకన్న , లింగన్న తదితరులున్నారు.