24-12-2025 12:36:41 AM
రోగి ప్రాణం పోతే సెటిల్మెంట్లు
లోటస్ హాస్పిటల్ బ్రాంచ్‌గా ప్రచారం
గజ్వేల్, డిసెంబర్ 23: గజ్వేల్ పట్టణంలోని పల్స్ హాస్పిటల్ యాజమాన్యం వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తుంది. వచ్చిరాని వైద్యంతో డాక్టర్లు వైద్య సేవలు అందించడంతోపాటు ఆపరేషన్లు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ కు చెందిన ఓ మహిళ గర్భాశయ సమస్యతో పల్స్ హాస్పిటల్ కు రాగా గత రెండు రోజుల క్రితం హాస్పిటల్ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించారు.
ఈ క్రమంలో మహిళ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి సమస్య ఏర్పడడంతో ఆసుపత్రి వైద్యులు ఏమి చేయాలో పాలు పోక హైదరాబాదులోని లోటస్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు తాము వైద్యం చేయలేమని చేతులెత్తేయడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రక్తనాళాల్లోని గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించేందుకు థ్రోంబోలిసిస్ ఇంజక్షన్ ఇచ్చి వైద్యం చేశారు.
అ యినా ఆలస్యం కావడంతో మహిళ మృతి చెందింది. మహిళ మృతికి కారణం గజ్వేల్ పల్స్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మహిళ గ్రామస్తులు పల్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించారు. ఆసుపత్రి యాజమాన్యం తమ నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణం పోయిందని గ్ర హించి గుట్టు చప్పుడు కాకుండా మృతి చెందిన మహిళ వైద్య ఖర్చులతో పాటు భారీ మొత్తంలో మహిళ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించారు.
దౌల్తాబాద్ మండలం ఇంద్రుప్రియాల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలు కాగా పల్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. వచ్చిరాని వైద్యం చేయడంతో సదరు వ్యక్తి ఇబ్బంది పడు తుండడంతో అతని బంధువులు వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. వైద్యులు వెం టనే ఆపరేషన్ చేయాలని లేని పక్షంలో మరింత ఇబ్బంది కలుగుతుందని చెప్పారు.
అప్పటికే పల్స్ ఆసుపత్రిలో వైద్యం పొందిన సమయంలో వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడం, మరోవైద్యుని వద్దకు వెళితే అసలు విషయం బయటపడడంతో పల్స్ ఆస్పత్రిలో వచ్చిరాని వై ద్యం చేస్తున్నారని, తాము డబ్బులు చెల్లించమని చెప్పారు. అయినా పల్స్ ఆస్పత్రి యాజమా న్యం డబ్బులు చెల్లిస్తే గాని వెళ్లేది లేదంటూ డబ్బు వసూలు చేశారు.
గతంలోనూ అదే ఆసుపత్రిలో పనిచేసిన ఓ నర్సు కు కూడా వైద్యులు వైద్యం చేయగా వికటించి మృతి చెందింది. ఇలా వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తూ న్యాయం పేరుతో డబ్బులతో సెటిల్మెంట్ చేస్తూ ఆసుపత్రిని కొనసాగిస్తున్నారు. పైగా హైదరాబాదుకు చెందిన లోటస్ ఆసుపత్రికి చెందిన బ్రాంచ్ ఆసుపత్రిగా పల్స్ ఆసుపత్రిని ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు నమ్మి వైద్యం కోసం రావడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.