calender_icon.png 30 July, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సిండికేటును వెంటనే ఎత్తివేయాలి

08-05-2025 12:00:00 AM

యువతరం పార్టీ డిమాండ్ 

భద్రాద్రి కొత్తగూడెం మే 7 (విజయ క్రాంతి): మద్యం సిండికేట్లను తక్షణమే ఎత్తివేయాలని యువతరం పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొంతమంది మద్యం షాపుల యజమానులు అందరూ కలిసి మద్యం సిండికేటుగా ఏర్పడి కొన్ని బ్రాండ్ల మద్యాన్ని వైన్ షాపుల్లో విక్రయించకుండా సిండికేట్ ద్వారా బెల్ట్ షాపులకు అధిక ధరలకు ఇస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు మద్యాన్ని  విక్రయిస్తున్నారని గతంలో జిల్లాలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సంఘటనలు  ఉన్నాయన్నారు. కల్తీ మద్యం కూడా జోరుగా సాగుతుందని, మద్యం అధిక ధరలకు అమ్ముతూ పేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పిలుస్తున్నారని ఆరాపించారు.

పాల్వంచ పట్టణ, మండల పరిధిలోని సిండికేట్ల పై  చర్యలు తీసుకోవాలని ఏప్రిల్ నాలుగో తేదీన  పాల్వంచ అబ్కారీ పోలీస్ స్టేషన్  ఎస్త్స్రకి  వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వినతి పత్రం ఇచ్చి ఇప్పటికీ నెల రోజులు గడుస్తున్న అబ్కారీ పోలీసులు ఎలాంటి  చర్యలు తీసుకోకపోవడాన్ని యువతరం పార్టీ తీవ్రంగా పరిగణించింది అన్నారు.

ఇప్పటికైనా అబ్కారీ పోలీసులు సిండికేట్ల పై చర్యలు తీసుకోవలని, లేనిపక్షంలో యువతరం పార్టీ ఆధ్వర్యంలో అబ్కారీ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు తిరుపతమ్మ మరియు జిల్లా నాయకులు బలగం సురేష్, సాయి రమేష్ ,రాము, కృష్ణ బాబు, కళ్యాణ్, చంటి, నీల, సుశీల, మంగ, కైక ,బన్నీ తదితరులు పాల్గొన్నారు .