calender_icon.png 17 January, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల చిరకాల వాంఛ నెరవేరిన వేళ

17-01-2026 02:59:54 AM

చనాకా కొరాటా పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసిన సీఎం  

ఆదిలాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): జిల్లా రైతుల చిరకాల వాంఛ ఎంతో కాలానికి నెరవేరిన వేళ. పెను గంగా నదిపై లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రాజెక్టు స్థానంలో చనాకా - కొరాటా బ్యారేజ్ నిర్మా ణం చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్‌కు సంబంధించిన పంప్ హౌస్ నుంచి ప్రధాన కాల్వకు నీటి విడుదల చేయడంతో ఎట్టకేలకు రైతుల కల నెరవేరింది.

భోరజ్ మం డలం హత్తీఘాట్ గ్రామంలో పెన్ గంగా నది ఒడ్డున నిర్మించిన చనాకా - కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్‌ను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలతో కలిసి సీఎం ప్రారంభించి ప్రధాన కాల్వ నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం పెన్ గంగా నదికి ప్రత్యేక పూజలు చేశారు.

ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మండలంలోని హత్తిఘాట్‌కు చేరుకున్న సీఎం,  మంత్రులకు స్థానిక ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. పంపు హౌస్ వద్ద సీఎం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, ఫోటో ప్రదర్శనను  సందర్శించా రు.

నీటి విడుదలకు సంబంధించిన వివరాలను కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారు లు ముఖ్యమంత్రికి, మంత్రులకు వివరించారు. ప్రభుత్వం రూ. 1,891 కోట్ల రూపా యల వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేయగా 5.12 టి.ఎం.సి ల నీటిని వినియోగించుకునే విధంగా చనాక - కొరా టా బ్యారేజ్ కు రూపకల్పన చేయబడింది.

ఈ బ్యారేజ్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, బీంపూర్, జైనథ్, బేల మండలాలలోని పెనుగంగ పరివాహక 89 గ్రామాల్లో 51 వేల ఎకరాలకు సాగునీరు, ఈ ప్రాంతాల ప్రజలకు త్రాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు నాగోబా ఆలయ కమిటి సభ్యులు జాతరకు రావాలని ముఖ్యమంత్రి, మంత్రులను కలెక్టర్, ఎస్పీ లతో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. 

మీడియాకు అనుమతి నిరాకరణ 

సీఎం రేవంత్ రెడ్డి హత్తీఘాట్ పంప్ హౌస్ వద్ద చేపట్టే నీటి విడుదల కార్యక్రమ కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులను గాని, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అనుమతించకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న వెల్లడించిన నేపథ్యంలో ఎవరిని అనుమతించక, భారీగా పోలీసు బందోబస్తు చేపట్టారు.