02-01-2026 12:49:45 AM
మహబూబ్ నగర్, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మహబూ బ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఘన విజయం లభించిందని గుర్తు చేశారు.
ప్రజాపాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిసిసి మీడియా సెల్ కన్వీనర్ సిజే బెనహార్, ఐఎన్టీయుసి రాములు యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అవేజ్,
హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, హన్వాడ మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నవనీత, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలి, సయ్యద్ ముస్తాక్ అలి, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, మైత్రి యాదయ్య, అమోధి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్ నాయక్, చిన్న రాజు, మోయీజ్, హకీం, అలి తదితరులు పాల్గొన్నారు.