17-01-2026 03:01:02 AM
వేములవాడ, జనవరి 16, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులు కొనసాగుతున్నాయని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, మహిళా శిశు సంక్షే మ శాఖ మంత్రి ధనసిరి సీతక్క తెలిపారు. ఈ పనులన్నింటినీ రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరమైన నిధులు మంజూ రు చేస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన మంత్రికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతే ఘనంగా స్వాగ తం పలికారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించి, కోడె మొక్కు చెల్లింపుతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాయత్రి మాత దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీత క్క మాట్లాడుతూ అధిక భక్తుల రద్దీ ఉండే ఆలయాల్లో మౌలిక వసతులు పెంచడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వేములవాడలోని రాజరాజే శ్వరస్వామి ఆలయం విస్తరణకు రూ.150 కోట్లతో పనులు కొనసాగుతున్నాయన్నారు.
అదేవిధంగా మేడారంలో సమ్మక్కసారల మ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు.ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లి అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారని, 19న జాతర పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు.మేడారం జాతరకు ముందు వేములవాడ రాజన్న దర్శనం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే తాను ఆలయానికి వచ్చానని మంత్రి సీతక్క తెలిపారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తల్లులను దర్శించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి, వేములవాడ ఆర్డీఓ రాధాభాయి, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.