04-01-2026 12:36:52 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): దేశంలోని ఇతర మెట్రో నగరా లతో పోటీపడుతూ హైదరాబాద్ ఎదుగుతోంది. ఇందుకు జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం తాజాగా విడుదల చేసిన 2025 వార్షిక గణాంకాలే ప్రబల నిదర్శనం. భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ద్వారా బల్దియా ఖజానాకు ఈ ఏడాది కాసుల పంట పండింది. 2024 తో పోలిస్తే 2025లో టౌన్ ప్లానింగ్ ఆదా యం ఏకంగా రూ.158.24 కోట్లు పెరగింది. 2024లో జీహెచ్‌ఎంసీకి భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ.1,114.24 కోట్లు ఆదాయం రాగా 2025లో రూ.1,272.36 కోట్ల ఆదాయం సమకూరింది.
అంటే గత ఏడాది కంటే సుమారు రూ. 158.24 కోట్లు అదనంగా ఖజానాకు చేరాయి. పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయా లు, హైరైజ్డ్ భవనాలకు అనుమతులు రావడమే ఈ ఆదాయ పెరుగుదలకు ప్రధాన కారణంగా అధికారులు విశ్లేషిస్తున్నారు. హైదరా బాద్ మహానగరం ఇప్పుడు ఆకాశహర్మ్యాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. స్థలాల కొరత, భూముల ధరలు విపరీతం గా పెరగడంతో బిల్డర్లు, డెవలపర్లు బహుళ అంతస్తుల నిర్మాణాల వైపే మొగ్గు చూపుతున్నారు.
2024లో కేవలం 69 హైరైజ్‌డ్ భవనాలకు అనుమతులు రాగా, 2025లో ఆ సంఖ్య సెంచరీ దాటింది. ఏకంగా 103 హైరైజ్డ్ భవనాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులు మంజూ రు చేసింది. ఇప్పటివరకు 30, 40 అంతస్తులకే పరిమితమైన హైదరాబాద్ స్కైలైన్ ఇప్పు డు మరింత ఎత్తుకు చేరనుంది. ఈ ఏడాది అనుమతి పొందిన వాటిలో రెసిడెన్షియల్ క్యాటగిరీ కింద రెండు భవనాలకు రికార్డు స్థాయిలో 55 అంతస్తుల అనుమతులు ఇవ్వడం విశేషం.
మరోవైపు నాన్-హై రైజ్డ్ విభాగంలోనూ సుమారు 2,381 భవనాలకు అనుమతులు లభించాయి. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024 లో 2,125 మందికి ఓసీలు జారీ చేయగా, 2025లో ఆ సంఖ్య 2,401కి చేరింది. నగర శివారు ప్రాంతాల్లోనూ రియ ల్ బూమ్ కనిపిస్తోంది. 2025లో మొత్తం 11,166 నిర్మా ణాలకు అనుమతులు ఇవ్వగా.. అందులో 30 భారీ లే-అవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. చిన్న భవనాల అనుమతు ల సంఖ్య 11,855 నుంచి 11,166కు స్వల్పంగా తగ్గినా, భారీ ప్రాజెక్టుల రాకతో ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది.