calender_icon.png 11 July, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంబూద్వీప మూల పురుషుడు జాంబవంతుడు

11-07-2025 12:19:04 AM

సంపతి రమేష్ మహారాజ్ :

కడపటి (ఊరి చివర ఉండే మాదిగ)వాడే  ఈ దేశానికి మొట్టమొదటి పాలకుడు అని జ్యోతిబా ఫూలే తన అధ్యయనం ద్వారా చాటిచెప్పారు. దీన్ని బట్టి నేడు మాదిగలు ఈ దేశ పాలకులు అనేది రుజువు అవుతుంది. మరో వైపు సామాజిక శాస్త్ర ప్రకారం ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, వెలమ, కమ్మ కులాలు శూద్రులుగానే చెబుతారు. ఇప్పటికీ ఒక కులానికి ఉన్న ఇంటి పేర్లు మరొక కులానికి కూడా ఉంటాయి. నేడు సామాజిక స్థితి మారడం వల్ల వీరి మధ్య విభజన రేఖ ఏర్పడింది.

హిందు పురాణాల్లోని సంకల్ప మం త్రంలో ‘జంబూద్వీపే భరతవర్షే భరతఖం డే’ అనే పదాల ఉచ్ఛరణ ఉంటుంది. వీటి ప్రకారం.. ఒకప్పుడు జంబూద్వీపంలో భారతదేశం భాగమని ఆ వాక్యాల సారాంశం. జంబూద్వీప భూమండలానికి తొలి మూల పురుషుడు, జాంబవ మహాచక్రవర్తి అని ‘జాంబవ ఇతిహాసం’ చెబుతు న్నది. ఇది డక్కలి వారి మౌఖిక జానపద చరిత్రలో మౌలికంగా కనిపిస్తుంది.

జాంబవంతుడు ఈ భూమికి ఆది దేవుడు, మహా ప్రభువు, మహారాజు. ఈ దేశాన్ని మొదట జంబూద్వీపం అనే వారని జానపద ఇతిహాసం, మౌఖిక చరిత్ర, శాస్త్రీయ పరిశో ధనలు, చరిత్రకారులు, విదేశీ సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాకుం డా ఈ నేలకు మొదటగా పేరు పెట్టింది మాదిగ జాతి బిడ్డని, మన ఉనికిని, గొప్పతనాన్ని చాటి చెపుతున్నాయి. నేటి మాదిగ లు జాంబవంతుని వారసులు, ఆయన వారసత్వంగా వచ్చిందే ఈ మానవజాతి.

అందుకే సమస్త ప్రపంచ జనాభాను ఉద్దేశించి ఏటా జూలై 11న నిర్వహించే ప్రపం చ జనాభా దినోత్సవం రోజు  ‘మాదిగ జాగృతి సంఘం’ జాంబవంతుని జయం తి నిర్వహిస్తున్నది. జంబూద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. ఇందు లో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవని పూరణాలు చెపుతున్నాయి.

భరతవర్షం అని పిలబడే భారతదేశం కూడా అందులో భాగమే. భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం వర కు జంబూద్వీపం వ్యాపించి ఉండేది. జంబూద్వీపానికి పాలకుడైన జాంబవంతుడు ఈ భూమిపై మానవ నాగరికతను, సంస్కృతిని, విలువలను  నెలకొల్పాడని చరిత్ర చెబుతుంది. 

మానవళికి స్వేచ్ఛ, సమానత్వం, సోదరాభావాన్ని నేర్పిన గొప్ప మహనీయుడు జాంబవంతుడు. గణతంత్ర విలువల ద్వారా రాజ్యాన్ని పాలించిన రాజు. మనుషులకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించి న గొప్ప దేవుడు. కుల, మత, వర్ణ భేదాలు లేకుండా మనుషుల మధ్య ప్రేమను నింపి, మానవ విలువలతో రాజ్యాన్ని ఏలాడు. స్త్రీలను గౌరవించే మాతృస్వా మ్య వ్యవస్థ కేంద్రంగా జాంబవ చక్రవర్తు  లు రాజ్య పరిపాలన చేసేవాడు.

వలసదా ర్లు అధర్మయుద్ధం ద్వారా జాంబవంతుడిని ఓడించారు. అనంతరం వారు రాసిన పురాణాల్లో జాంబవంతుని చరిత్రను తలకిందులు చేశారు. మనుషులను నాలుగు వర్ణాలుగా, అనంతరం  కులాలుగా విభజించారు. జాంబవంతుని వారసులైన మాదిగలను అతిశూద్రులుగా, పంచమ వర్ణంగా అట్టడుగున చేర్చారు. అనేక అవలక్షణాలు అంటగట్టి మాదిగలను ఊర వతల జీవించే పరిస్థితికి తీసుకొచ్చారు.

వీరికి విద్య, భూమి, ఆయుధం, సింహాస నం అందకుండా చేశారు. ఇప్పటికీ వీరి ఇండ్లు ఊరు బయటనే ఉండడం దీనికి సజీవ సాక్ష్యం. కడపటి (ఊరి చివర ఉండే మాదిగలు)వాడే  ఈ దేశానికి మొట్టమొదటి పాలకుడు అని జ్యోతిబా ఫూలే  తన అధ్యయనం ద్వారా చాటిచెప్పారు.

దీన్ని బట్టి నేడు మాదిగలు ఈ దేశ పాలకులు అనేది రుజువు అవుతుంది. మరో వైపు సామాజిక శాస్త్ర ప్రకారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, వెలమ, కమ్మ  కులాలు శూద్రులుగానే చెబుతారు. ఇప్పటికీ ఒక కులానికి ఉన్న ఇంటి పేర్లు మరోక కులానికి కూడా ఉంటాయి. నేడు సామాజిక స్థితి మారడం వల్ల వీరి మధ్య విభజన రేఖ ఏర్పడింది.

వారసత్వ జ్ఞానంతో చైతన్యం కావాలి

మాదిగలు ఒకప్పటి ఈ దేశ నిర్మాతలు, రాజులు అయి ఉండి, వారి చరిత్రను మరచిపోయి, జ్ఞానాన్ని కోల్పోయి, అన్నం కోసం బతికే హీన జీవులుగా బతకాల్సిన స్థితి. ఈ క్రమంలో ‘దళిత శక్తి ప్రోగ్రాం’ ద్వారా డాక్టర్ విశారదన్ మహరాజ్ తొలిసారి తెలంగాణకు జాంబవంతుని చరిత్ర ను పరిచయం చేశారు. మాదిగలు జాంబవంతుని వారసులని, ఈ దేశాన్ని పాలిం చిన మహారాజ్‌లమని చెప్పి ఆత్మన్యూనత భావాన్ని తొలగించారు. 

5వేల కిలోమీట ర్ల మహాకాలినడక ద్వారా ప్రతి మాదిగ గూడెంలోకి వెళ్లి, అక్కడ మహారాజ్ కాలనీ బోర్డ్‌లు కూడా పెట్టారు. దీంతో  కొన్నాళ్లు గా తెలంగాణలో జాంబవంతుడు, మాదిగల వారసత్వ చరిత్ర గురించి చర్చ జరు గుతున్నది. ఇప్పటిదాకా మాదిగల పూర్వీకులు చెప్పులు కుట్టేవాళ్లు, డప్పు కొట్టేవాళ్లు అని కొన్ని సంఘాలు చెప్పుకుంటూ తిరిగాయి. మరోవైపు నేడు మనుధర్మం స్త్రీలకు ఆంక్షలు పెట్టి, అణగదొక్కింది.

బానిసత్వం, అంటరానితనం, స్త్రీల వెనుకబాటుతనానికి కారణమైన ధర్మాన్ని, సంస్కృతిని ఆరాధిస్తున్నాం. కానీ మన చరిత్రను  మాదిగ జాగృతి సంఘం శాస్త్రీయంగా అధ్యయనం చేసి  తమ పూర్వీకులు ఒకనాడు  గొప్పజ్ఞానంతో ఈ దేశాన్ని పరిపాలించిన రాజులమని చెబుతోంది. 

భారతీయ సమాజంలో మూలవాసీ సంస్కృతిని వెలికి తీయడానికీ , జాతుల సమస్యలోని వివిధ కోణాల్ని అధ్యయనం చేసి లోతుపాతుల్ని గ్రహించడానికీ , తరతరాలుగా మరుగున పడివున్న ఉత్పత్తి కులాలకు చెందిన ప్రజాశ్రేణుల చరిత్ర అవగాహనకీ, వారి మధ్య నెలకొన్న సాం స్కృతిక అగాథాల్ని పూడ్చి, ఐక్యత సాధించడానికీ మౌఖికంగా భిన్న రూపాల్లో లభ్యమౌతున్న జాంబ పురాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.

ఏ జాంబపు రాణమైనా పాఠ్యంలోగానీ, ప్రదర్శనలో గానీ శిష్ట పురాణాల పాఠ్యానికి, ప్రదర్శనకు తీసిపోదు.  ఒకే కుల పురాణంలో ఇన్ని రకాల వైవిధ్యం మరెక్కడా కనిపించదు. వాటిలో ప్రతిపాదించిన అంశాలకు ఎవరికి వారు కట్టుబడి వుంటారు. వాటిలో ముఖ్యమైనది ఆది జాంబవుని మహోన్నతుడిగా వర్ణించడం, తమ కులాన్ని తక్కిన కులాలన్నింటికంటే వున్నతమైనదిగా స్థాపించడం.

కుల, మత, వర్ణ భేదాలు లేని సమాజం లో ప్రజలని కన్న బిడ్డల్లా భావించేవారని జాంబవంతుడి చరిత్ర చాటి చెబుతున్నది. ‘చరిత్ర తెలియని వాడు.. చరిత్ర సృష్టించలేడు’ అంటాడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్. ఆయన జాంబవంతుని విలువలనూ రాజ్యాంగంలో పొందుపరిచాడు. మాదిగల ఉద్యమ లక్ష్యం దీనస్థితిలో, అ జ్ఞానంలో ఉన్న శరీరాలకు అన్నం పెట్టడం, డబ్బులు ఇవ్వడం, ఓట్ల కోసం జాతిని తాకట్టు పెట్టడం కాదు. 

జ్ఞానం ద్వారా సం స్కరణలకు నాంది పలకడమే. ఇవే మాది గ ఉద్యమాలకు ఉండాల్సిన లక్షణాలు. ఈ నేపథ్యంలో మాదిగలు పూర్వీకుల చరిత్ర, సంస్కృతి, జ్ఞానం వారసత్వాన్ని తెలుసుకొని ఆత్మగౌరవంతో రాజ్యాధికారం వైపు ప్రయాణించాలి. అప్పుడే ఈ దేశంలో అం టరానితనం అనుభవిస్తూ ఊరవతల ఉన్న మాదిగలు పాలకులవుతారు. అప్పు డే ఈ సమస్త సంపద, వనరులు అందరికీ సమానంగా అందుతాయి.

 వ్యాసకర్త సెల్: 7989578428