13-12-2025 12:49:19 AM
మహారుద్ర సహిత సహస్రచండీ మహాయాగం
తుర్కయంజాల్, డిసెంబర్ 12: తుర్కయంజాల్కు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. వచ్చేనెల 28నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు శ్రీ రేణుకా రాజరాజేశ్వరి పీఠం ఆధ్వర్యంలో మహారుద్ర సహిత సహస్రచండీయాగం నిర్వహించనున్నారు. రాగన్నగూడ కరెంట్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న ఓపెన్ గ్రౌండ్లో మెళ్లూరి నవీన్ శర్మ ఆధ్వర్యంలో ఈ యాగం జరగనుంది. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానికులతో కలిసి నవీన్ శర్మ పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఐదురోజుల పాటు జరిగే ఈ యాగంలో సుమారు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. 200మంది బ్రాహ్మణులతో అత్యంత నిష్టతో నిర్వహించబోతున్నామన్నారు. ప్రతిరోజు 2500మందికి అన్నప్రసాదం, సాయంత్రం స్నాక్స్ ఇస్తామన్నారు. ఐదురోజుల పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
యాగానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మహత్తర యాగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నవీన్ శర్మ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, బాకారం నర్సింహారెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.