calender_icon.png 24 December, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీలను అదర్శంగా తీర్చిదిద్దాలి

24-12-2025 02:03:41 AM

  1. నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు.. వార్డు సభ్యులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
  2. నేడు కొడంగల్‌కు సీఎం

హైదరాబాద్, డిసెంబర్  23 (విజయక్రాం తి): రాష్ర్ట వ్యాప్తంగా సర్పంచ్‌లుగా, ఉప సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఎక్స్‌వేదిగా అభినందనలు తెలిపారు. ‘మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని నేను ఆకాంక్షిస్తున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిం చారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించారు.

దేశానికి పీవీ చేసిన సేవలను కొని యాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవా రం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు వెళ్లనున్నారు. నియోజకవర్గంలో గెలు పొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో సీఎం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లతో సీఎం ముఖాముఖి చర్చ జరపనున్నారు. గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సర్పంచ్‌లతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేయనున్నారు. 

ఉప సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు అబద్ధం: మంత్రి సీతక్క

ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దుపై సోషల్ మీడియాలో కొనసాగిన ప్రచారానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముగిం పు పలికారు. ఉప సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని, ప్రభుత్వం అలాంటి నిర్ణయమేది తీసుకోలేదని మంత్రి సీతక్క మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉప సర్పంచ్‌ల అధికారాల విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, సోషల్ మీడియా, ఇతర మీడియా వేదికల్లో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు.