calender_icon.png 14 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటేసేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు

14-12-2025 12:15:39 AM

  1. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు దుర్మరణం

మెదక్ జిల్లా కోలపల్లి జాతీయ రహదారిపై ఘటన

పెద్దశంకరంపేట(మెదక్), డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఓటు వేయడానికి బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగింది. హైదరాబాద్ లింగంపల్లిలో ఉంటున్న లింగమయ్య, సాయమ్మ భార్యాభర్తలు. వారికి కూతురు మానస, కొడుకు సాయి ఉన్నారు.

వారి స్వగ్రామం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామంలో రెండో విడతలో ఓటు వేసుందుకని శనివారం ద్విచక్ర వాహనంపై నలుగురు బయలుదేరారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం 161 జాతీయ రహదారి కోలపల్లి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం బైక్‌ణు వేగంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పెద్దశంకరంపేట ఎస్సై ప్రవీన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.