12-04-2025 12:36:47 AM
హనుమాన్ జయంతి వేడుకలకు ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్‌నగర్ ఏప్రిల్ 11 (విజయ క్రాంతి) : హనుమాన్ జయంతి సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్ శోభాయాత్రలు ప్రశాంతంగా జరగడానికి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని.
ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు. నిరంతరం పెట్రోలింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాట్ల, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్, ప్రజలు, పెద్దలు, పిల్లలు, రోగులు ఇబ్బందిపడే అవకాశం ఉండటంతో డీజేలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు.
ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సహనంగా ప్రవర్తించాలని, ఇతర మతాల మనోభావాలను దెబ్బతినేటట్లు ఏ విధంగా కూడా వివాదాస్పద నినాదాలు, ప్రసంగాలు, పాటలు వినిపించకూడదన్నారు. ర్యాలీ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు సహకారం అందించాలని పేర్కొన్నారు. రూమర్లు, అనవసర పోస్టులు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న 100 కాల్ చేయాలని సూచించారు.