11-12-2025 12:00:00 AM
డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ ఆథారిటీ సభ్యులు
నల్గొండటౌన్, డిసెంబర్10 (విజయ క్రాంతి): జీవితంలో మానవ హక్కులపై అవగాహన ఉంటే సమస్యలు లేని జీవనం కొనసాగించడం సాధ్యం అవుతుందని, రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోనీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులకు హక్కులపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన సదస్సుకు అయన హాజరై మాట్లాడినారు.
హక్కులకు భంగం కలిగితే రక్షణకు పోలీస్ కంప్లైంట్స్ ఆధారిటి,మానవ హక్కుల కమిషన్, మహిళ కమిషన్, బాలల, కమిషన్, రాష్ట్రంలో పనిచేస్తుందన్నారు ప్రభుత్వo హక్కులు రక్షించబడితేనే మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదగగలడని, ఇటువంటి హక్కులను కాపాడేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. సమాజంలో ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుందో అప్పుడే మానవుల అన్ని హక్కులను కాపాడేందుకు దోహదపడతాయి అని తెలిపారు.
మానవ హక్కుల రక్షణలో ప్రధాన పాత్ర పోలీసులదని వారు ప్రజల హక్కులను కాపాడడంలో నిరంతరం విధులు నిర్వర్తించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం జాప్యం వహించితే వారిపై తగిన చర్యలను పోలీస్ కంప్లైంట్స్ ఆధారిటి తీసుకుంటుందని,ప్రభుత్వానికి,ప్రజలకు,పోలీసులకు మధ్య వారధిగా వ్యవహరి స్తుందని, ప్రజల హక్కుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని ఆన్నారు. మాజీ ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ...
ప్రజాస్వామ్యంలో ప్రజలు యాజమానులని, పారదర్శక పాలన, జవాబుదారితనంతో ఉద్యోగులు పనిచేయాలని ప్రజలు చెల్లించే పన్నుల తోనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థి దశలో హక్కులపై అవగాహన పొందడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడం సాధ్యం అవుతుందని ఆన్నారు.
కళాశాల గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ, అవినీతి 50 శాతం తగ్గిందని, ఇంక రానున్న రోజుల్లో మిగతా 50 శాతం నిర్మూలించే బాధ్యత భారతదేశంలోని యువతపై ఎక్కువగా ఆధారపడి ఉందని, యువత తమ హక్కులను గుర్తించి, వాటిని సాధించే దిశగా పాటుపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొబ్బిలి గోపాల కృష్ణ, నరసింహ, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ దయానంద్, డాక్టర్ వసంత, చైతన్య సుధ, పుష్పలత ,కళాశాల వైస్ ప్రిన్సిపల్ మంజుల అధ్యాపకులు డాక్టర్ సాలయ్య డాక్టర్ సునీత, వనజ, అజయ్ కుమార్, రామ్ రెడ్డి, వీరన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.