calender_icon.png 20 August, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంబర్‌లోనే మా సమస్యకు పరిష్కారం

08-08-2025 12:00:00 AM

ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని

టాలీవుడ్‌లో సినీకార్మికుల సమ్మె నాలుగో రోజూ కొనసాగింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు గురువారం తెలుగు ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి బాధ్యులతో చర్చలు జరిపారు. ఫిల్మ్ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశం ముఖ్యాంశాలను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మీడియాకు వివరించారు.

‘సమ్మెకు పిలుపునిచ్చిప్పట్నుంచీ మేం అనుకున్న నిర్ణయాలతోనే చిత్ర పరిశ్రమకు ఆటంకం కాకుండా చూస్తున్నాం. మేం ముందు చెప్పినట్టు.. యధావిధిగా 30 శాతం వేతన పెంపు ఇస్తున్న వారికి షూటింగ్స్ చేస్తున్నాం. అయితే, నిర్మాతల వైపు నుంచి  వచ్చిన నాలుగు ప్రపోజల్స్ మీదే చర్చ నడిచింది. రెండు ప్రపోజల్స్‌కు మేము అంగీకరిస్తామని చెప్పాం. మరో రెండు ప్రపోజల్స్ గురించి మా ఎంప్లాయీస్ యూనియన్లతో చర్చ జరపాల్సి ఉంది.

ఈ సమస్యను ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్  కౌన్సిల్‌లోనే పరిష్కరించుకుంటాం. రేపు (శుక్రవారం) సెలవు.. ఎల్లుండి (శనివారం) ఛాంబర్ మీటింగ్ ఉండొచ్చు. ఈ విషయాన్ని పరిశ్రమ పెద్దలైన చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి వెళ్లింది. వాళ్లు అందరికీ న్యాయం చేస్తారు. చిన్న నిర్మాతల ప్రపొజల్స్‌పై తుది నిర్ణయం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకుంటుంది.

చిన్న సినిమాలకు నిర్మాతలకు మా సపోర్ట్ ఉంటుంది” అని చెప్పారు. వేతనాల పెంపు విషయమై ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారం తీసుకోవాలనుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా కలువాలనుకున్నారు. అయితే, వారు ఈ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజును, మంత్రిని కలువలేదని తెలుస్తోంది.