09-09-2025 01:22:10 AM
స్టార్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజాచిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సూపర్ స్టార్‌గా ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే..’తో తన పెన్ పవర్ చూపించారు చిత్ర కథానాయకుడు రామ్ పోతినేని. సోమవారం మేకర్స్ విడుదల చేసిన రెండోగీతం ‘పప్పీ షేమ్’తో హీరో రామ్ పోతినేని ఇప్పుడు తన గాత్ర కళను సైతం ప్రదర్శించారు.
వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్, మెర్విన్; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్; కథ - మహేశ్‌బాబు పీ.