10-01-2026 01:40:34 AM
హైదరాబాద్, జనవరి ౯ (విజయక్రాంతి): వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డ బ్లూఈఎఫ్) దావోస్- 2026లో తెలంగాణ రైజింగ్- 2047 వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆ అంతర్జాతీయ వేదికలో తమ ప్రభుత్వ పాలసీ క్యూర్, ప్యూర్, రేర్ స్ఫూర్తిని ప్రదర్శించాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19 నుంచి 23 వరకు డావోస్ వేదికగా డబ్ల్యూఎఫ్ స్టాల్స్ జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో అందు కు సంబంధించిన యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనే లక్ష్యం గా ప్రణాళికలు, వ్యూహాలు అమలు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ రైజిం గ్ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన మూడు దశల ఆర్థిక వృద్ధి వ్యూహం తో పెట్టుబడులను ఆకర్షించాలని సూ చించారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పురోగతిని సమీక్షించి, అ డ్డంకులను గుర్తించాలని, తర్వాత వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.