01-07-2025 12:00:00 AM
‘బాబోయ్.. విమాన ప్రయాణం’ శీర్షికన ‘విజయక్రాంతి’లో వచ్చిన సంపాదకీయం వాస్తవ పరిస్థితికి అద్దం పట్టింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న భారత ప్రభుత్వం విమానయాన రంగాన్ని ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నది? తాజాగా మరో ఎయిరిండియాకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. విమానయాన శాఖ ఇప్పటికైనా పటిష్టం గా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
డి.శ్రీనివాస్, బెంగళూర్