calender_icon.png 31 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం

31-01-2026 12:55:29 AM

మేడ్చల్, జనవరి 30(విజయ క్రాంతి): జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం అలియాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ప్రభు త్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమ లు చేయలేదని విమర్శించారు. అస లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హతనే లేదన్నారు.

ఆరు గ్యారెంటీలలో ఒకటి కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదన్నారు. జిల్లాలో అనేకమందికి రుణమాఫీ కూడా కాలేదని, రైతులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలోని మొత్తం 68 వార్డులలో 60 కి పైగా గెలుపొందుతామన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనేక వార్డులలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలేదన్నారు. 

బీఆర్‌ఎస్‌లో చేరిక 

అలియాబాద్‌కు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బండి లక్ష్మి, బండి రాంరెడ్డి, శ్రీకర్ రెడ్డి తో పాటు పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు. వీరికి గులాబీ పండుగ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.