30-10-2025 01:07:05 AM
- జిల్లా వ్యాప్తంగా వర్షాలు, పొంగిన వాగులు
- లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు
ఖమ్మం, అక్టోబరు 29 (విజయ క్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ముంత తుఫాను జిల్లాను తాకటంతో జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదయింది. ఈ ప్రభావంతో ఖ మ్మం పట్టణ శివారులోని మున్నేరు పొంగడంతో పాటు, జిల్లాలో అక్కడక్కడా వాగులు పొంగి పొర్లాయి. తుఫాను దా టికి జిల్లాలో అక్కడక్కడ పలు పంటలకి నష్టం వాటిల్లింది. తు ఫాను దృష్ట్యా అప్రమత్తమైన జిల్లా ఉన్నతాధికారులు ముం పు ప్రాంతాలు, వాగులు పొంగుతున్న ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించారు.
సాయంత్రం ఐదు గంటల వరకు జి ల్లా వ్యాప్తంగా 31.2 మి.మీ వర్షపాతం నమోదయింది. కామేపల్లి మండలంలో అత్యధికంగా 93.8 మి.మీ వర్షపాతం న మోదవగా, సింగరేణిలో 91 మి.మీ, తిరుమలయపాలెంలో 89.4 మి.మీ, ఖమ్మం రూరల్ లో 61.8 మి. మీ, రఘునాధపాలెం లో 43.3 మి.మీ వర్షపాతం కురిసింది. ఇక ఎగువన కురిసిన వర్షాలకు మున్నేరులో వరద ప్రవాహం గంట గంటకు పెరగసాగింది. బుధవారం ఉదయం సాధారణంగా ఉన్న మున్నేటి ప్రవాహం సాయంత్రానికి 17 అడుగుల మేర పెరిగింది.
రెండేళ్ల కింద మున్నేరు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచి వేయడంతో పలు కాలనీలు జల మయమయి, తీవ్ర నష్టం వాటిల్లింది. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా జిల్లా ఉన్నతాధికారులు ముందస్తుగా సిద్ధమయ్యారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతాలైన బొక్కలగడ్డ, మున్నేరుఘాట్, జలగం నగర్ వంటి పలు కాలనీల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వాగులో కొట్టుకుపోయిన వాహనం, డ్రైవర్ గల్లంతు
వర్ష ప్రభావంతో వైరా నియోజకవర్గం కొణిజర్ల మండ లం అంజనాపురం నిమ్మ వాగు ఉధృతంగా పొంగింది. వరద ధాటికి వంతెన పై నుంచి నీరు ప్రవహించింది. ప్రమాదాన్ని అంచనా వేయటంలో విఫలమైన ఓ డ్రైవర్ వరద ప్రవాహంలోనే వంతెన దాటే ప్రయత్నం చేశాడు. వంతెన మధ్యలోనికి చేరుకున్న తర్వాత వరద ప్రవాహానికి వాహనం ముందు కదల లేకపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి నీటి ఉధృతికి వాహనం వాగులోకి ఒరిగి, కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవరు గల్లంతయ్యాడు.