calender_icon.png 27 September, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేనెతుట్టెను కదిపిన సుప్రీంకోర్టు

26-09-2025 12:00:00 AM

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అని సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. టెట్ లేకుం డా సర్వీస్‌లో ఉన్నవారితో పాటు ప్రమోషన్స్ పొందే వారు కూడా టెట్ పాసయ్యి ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొంది. తమిళనాడు, మహారాష్ర్ట లకి సంబంధించిన టెట్ వివాదంలో జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మ న్మోహన్ ల ధర్మాసనం తమ తీర్పును వెల్లడించింది. అయితే ఇందులో పలు రకాల న్యాయ చట్టపర అంశాల్లో వి వాదాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు టెట్‌పై ఇచ్చిన తీర్పులో పలు రకాల వివాదాలు ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ర్టలో 2009 తర్వాత నియామకమయిన టీచర్లలో కొందరు ప్రమోషన్స్ పొందగా.. వా రిలో టెట్ లేకుండా సర్వీస్‌లో ఉన్నారం టూ టెట్ పాసైన ఇన్ సర్వీస్ టీచర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ అం శంపై సింగిల్ బెంచ్ తీర్పు ఇస్తూ.. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రమోషన్స్ అయినా, నియామకమయినా.. రెండింటిలోనూ టెట్ ఉండా లని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆయా రాష్ట్రాల విద్యాశాఖ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో అప్పీల్ చేయగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించారు. ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ అవసరం లేదని.. 2010 చట్టం ప్రకారం, 2011 జాతీయ ఉ పాధ్యాయ శిక్షణ మండలి సెక్షన్ ప్రకా రం అర్హతలు రూపొందించి పలు రాష్ట్రాల టెట్ రూల్స్‌లో కూడా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని పేర్కొన్నారు.

టెట్ తప్పనిసరంటూ

జాతీయ స్థాయి టెట్‌లో కూడా ఇవే రూల్స్ పొందుపరిచారు. అయితే ఆ తీర్పు ను సవాల్ చేస్తూ తమిళనాడులో టెట్ పాసైన కొందరు టీచర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు వాయిదా ల అనంతరం వాదనలు జరిగాయి. విద్యాహక్కు చట్టం అమలుకు ముందున్న టీచ ర్లు కూడా టెట్ పాసయ్యి ఉండాలని వారి కోసం కొన్ని సడలింపులు ఇచ్చారు. పదవీ విరమణకు సర్వీస్ 5 సంవత్సరాల్లోపూ ఉన్న టీచర్లు టెట్ అవసరం లేకుండానే మిగతా సర్వీస్ పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అయితే సర్వీస్ 5 సంవత్సరాల పై న ఉన్న టీచర్లు మాత్రం రాబోయే 2 సంవత్సరాల్లో తప్పనిసరిగా టెట్ పాస్ కావాల ని, ప్రమోషన్స్ పొందాలన్నా కూడా టెట్ ఉండాల్సిందే లేదంటే సర్వీస్ నుంచి వైదొలగాలని స్పష్టం చేసింది. అయితే ఇక్కడే అసలు అంశం దాగి ఉంది. అర్హతలు, సర్వీ స్ అంశాల్లో వివాదాలు ఉన్నాయి. 2009 కంటే ముందు ఉన్న టీచర్లు అందరూ కూడా టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు.  విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చా లా రాష్ట్రాల్లో 2010 తర్వాత ప్రమోషన్స్ ప్రక్రియలో టెట్ లేకుండా ప్రమోషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.

మన రాష్ర్టంలో కూడా 3 సార్లు టెట్ లేకుండా ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 2023లో హైకోర్ట్ తీర్పు ఇస్తూ టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ దానిని అమలు చేయలేదు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు టెట్ అనే అంశం న్యాయపరంగా చెల్లదు. జాతీయ ఉపాద్యాయ శిక్షణ మండలి రూల్స్‌లో కూడా ప్రమోషన్ అనేది నియామకం కిందకే వస్తుంది. ఇందులో 2009 ముందు నియామకం అయిన టీచర్లు 2009 తర్వాత ప్రమోషన్స్ పొందారు. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్నారు. తాజా సుప్రీం కోర్టు తీర్పు వీరికి ప్రత్యక్షంగా వర్తిస్తుంది. 

అన్యాయం ఎవరికీ?             

2009కి పూర్వం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఉద్యోగ అర్హతకు బి.ఎడ్, డి.ఎడ్  కోర్సులు చేయాల్సిందే. కానీ 2011లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల ఎంపిక కోసం టెట్ పేపర్ కేవలం డి.ఎడ్ వారినే అర్హులుగా ప్రకటిస్తూ గెజిట్ జారీ చేశారు. సుప్రీం తీర్పు ప్రకారమే రాష్ట్రాల్లోనూ ఈ నిబంధనను అమలు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 2012, 2017 డీఎస్సీలోనూ దీనినే అమలు చేశారు.

2018 వరకు ఆ తీర్పు అమల్లో ఉండగా.. కేంద్ర ప్రభుత్వ రాజకీయ జోక్యంతో సుప్రీం కోర్టు తీర్పును పక్కనబెట్టి.. 2018 నవంబర్‌లో జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ప్రాథమిక స్థాయి ఉపాద్యాయ పోస్టులకు  బి.ఎడ్ వారికి కూడా టెట్ పేపర్ రాయడానికి అవకాశం ఇచ్చారు. బి.ఎడ్ అభ్యర్థుల కో సం 6 నెలల బ్రిడ్జి కోర్సు ప్రవేశపెట్టి ప్రాథమిక స్థాయి శిక్షణ తీసుకోవాలని పేర్కొ న్నారు. కానీ మన రాష్ర్టంలో 2023 వరకు మరొక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. 

డి.ఎడ్ వారే అర్హులు!

టెట్ మాత్రం 2022,2023లో వెలువడగ అందులో పేపర్ బి.ఎడ్ వారికి అవకాశమిచ్చారు. మరోపక్క ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు మరొక 10 రాష్ట్రాల్లో 2018 నుంచి 2023 మధ్య ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ వెలువడగా బ్రిడ్జి కోర్సు లేకుండా  బి.ఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీలుగా ఎంపిక చేసారు. వీటిపై డి.ఎడ్ అభ్యర్థులు సుప్రీం కోర్టులో ‘రాజస్థాన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ పరిధిలోని అధికారులకు సుప్రీంకోర్టులో పలు మార్లు విచారణ జరిగింది.

చట్టబద్దత లేని బ్రిడ్జి కోర్సులు చెల్లవని, అలాగే ప్రాథమిక స్థాయి పోస్టులకు డి.ఎడ్ వారే అర్హులని సుప్రీం తీర్పునిచ్చింది. దీంతో జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి తమ తప్పును ఒప్పుకొని దేశ వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో కేవలం డి.ఎడ్ వారికే అవకాశం ఇవ్వాలని మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై ఎన్సీటీఈ సమీక్ష చేసి.. రివ్యూ పిటిషన్ ఇవ్వడమా? లేదంటే తీర్పు అమలుపై ఉత్తర్వులు ఇవ్వడమా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. తమిళనాడు, మహారాష్ర్ట అంశాల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వేళ జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సర్వీస్ పరంగా, అర్హతల విషయం పరంగా సుప్రీం కోర్ట్టు తీర్పు వేర్వేరుగా ఉండాల్సిన అవసరముంది.

వ్యాసకర్త సెల్: 6305458920