calender_icon.png 31 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది

31-01-2026 12:00:00 AM

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

మాగనూరు జనవరి 30: ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని భావిభారత పౌరులను తీర్చిదిద్ది సక్రమ మార్గంలో తీర్చేది ఒక్క ఉపాధ్యాయుడి ద్వారానే సాధ్యమని రాష్ట్ర క్రీడల యువజనశాఖ మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మాగనూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ, మురళి గారి రెడ్డి ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ  ప్రైవేటు బడులకన్నా ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వ బడలలో చదివిన వారే ఎక్కువగా సివిల్స్ కు ఎంపిక అవుతున్నారని వారు తెలిపారు.

మక్తల్ లో 230 కోట్లతో 25 ఎకరాల్లో త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రారంభమవుతుందని వారు వెల్లడించారు. విద్యా జ్ఞానము ఎవరు సొత్తు కాదని కష్టపడి చదివితే అది అందరి సొత్తు అవుతుందని అన్నారు. కష్టపడకుండా ఏదీ రాదని కష్టపడ్డ కూడా వచ్చేది ఎల్లకాలం నిలవదని ఇతవు పలికారు .విద్యార్థులు చదువుతోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం స్పోరట్స్ పాలసీ తీసుకొచ్చిందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో మాగనూరు సర్పంచ్ దండు జనార్ధనమ్మ, స్కూల్ చైర్మన్ ఇందిరమ్మ, కృష్ణ ఎంఈఓ నిజముద్దీన్, మక్తల్ ఎంఈఓ అమ్రుద్దీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడు, శివరాం రెడ్డి, నరసింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండలంలోని ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.