calender_icon.png 28 July, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు

25-07-2025 12:31:33 AM

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి, జూలై 24 (విజయ క్రాంతి): సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ఏసుక్రీస్తు అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సత్యనారాయణపురంలో  రూ.10లక్షలతో నిర్మించిన సీఎస్‌ఐ చర్చిని గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన బోధనలు మానవాళికి మార్గదర్శకాలన్నారు. ఏసు తన చల్లటి చూపులతో సమస్త మానవాళికి సుఖశాంతులను అందించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.