calender_icon.png 24 October, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజరాజేశ్వరుని ఆలయానికే శఠగోపం..!

23-10-2025 10:12:47 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మరమ్మత్తుల పేరిట దేవుడి ఆలయానికే శఠగోపం పెట్టి ఓ కాంట్రాక్టర్ నిధులు కొల్లగొట్టిన సంఘటన బెల్లంపల్లి మండలంలో చోటుచేసుకుంది. కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద రూ. 50 లక్షల సిజియఫ్ నిధులతో కాలక్షేప మండపాన్ని నిర్మించారు. అయితే ఈ పనులు అస్తవ్యస్తంగానే చేపట్టడంతో దేవాదాయ శాఖ అధికారులు రూ. 7 లక్షల వరకు బిల్లును నిలిపివేశారు.

పురాతన శివాలయంపై భాగంలో శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు పూర్తి చేస్తేనే బిల్లులు చెల్లించేలా కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదిరింది. గర్భగుడి పైన మండపం ప్రాంతంలో నాసిరకం షీట్లు వేసి చేతులు దులిపేసుకున్నారు. దేవాలయంపై మరమ్మత్తు పనులు పూర్తి అయినట్లు చూపడంతో దేవాదాయ శాఖ అధికారులు బిల్లులు చెల్లించారు. ఈ విషయమై కాంట్రాక్టర్ ను వివరణ కోరగా తాను మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.