12-11-2025 12:34:35 AM
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాను సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, డైరెక్టర్లు బాబీ, సందీప్‌రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, నిర్మాత లగడపాటి శ్రీధర్, నిర్మాత శింగనమల కల్యాణ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ అవుతాయని గతంలో ప్రూవ్ అయ్యింది. పెళ్లికాగానే ఆ జంట మీద పిల్లల కోసం ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఈ ప్రెషర్ వస్తుంది. నేనూ ఆ ప్రెషర్ చూశా. కొత్త జంటలు పరస్పరం అర్థం చేసుకున్నాకే పిల్లలు గురించి ప్లాన్ చేసుకోండని సలహా ఇస్తున్నా” అన్నారు. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. “సెన్సిటివ్ సబ్జెక్ట్ అందరికీ నచ్చేలా చెప్పే ప్రయత్నం చేశారు.
తప్పకుండా సక్సెస్ దక్కుతుంది” అని చెప్పారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “ఈ మూవీ చివరలో మంచి ఎమోషన్‌తో, మెసేజ్‌తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు” అని తెలిపారు. చాందిని చౌదరి మాట్లాడుతూ.. “ఇన్ ఫెర్టిలిటీ ఇష్యూ అంటే అమ్మాయిలోనే లోపం ఉందనే అభిప్రాయానికి వచ్చేవారు. కానీ ఫస్ట్ టైమ్ మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను చూపించడం కొత్తగా అనిపించింది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ సమస్య మీద అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాం” అన్నారు. డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఫెర్టిలిటీ ఇష్యూను అలాగే తెరకెక్కిస్తే భయపడతారు.
అందుకే ఆ కథ చుట్టూ ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ చేసి రూపొందించాం” అన్నారు. ‘రిలీజ్ అయ్యాక అది సాధించే విజయాలకు అడ్డు ఉండద’ని నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘ఈ సినిమాకు మేము చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందనే ఆశిస్తున్నాం’ అని నిర్మాత నిర్వి హరిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ బాలవర్ధన్, డైలాగ్ రైటర్ కల్యాణ్ రాఘవ్, స్క్రీన్‌ప్లే రైటర్ షేక్ దావూద్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.