01-08-2025 12:00:00 AM
నేడు అన్నాభావు సాఠె జయంతి :
సామాజిక అసమానతల కారణంగా బడికి వెళ్లలేని ఎంతోమంది ఉంటారు. వారిలో ఎంతోమంది నిరక్షరాస్యులుగా మిగులు తారు. కాని అన్నాభావు సాఠె లాంటి కొందరు తమ జీవితాన్నే పాఠశాలగా మలచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. జీవితంలో బడి ముఖం చూడని సాఠె గొప్ప సాహిత్య సామ్రాట్ ఎదిగాడు. ఆయన అసలు పేరు తుకారాం భావురావ్ సాఠె. 1920 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. బతుకుదెరువు కోసం బొంబాయికి వలస వచ్చి, ఎన్నో రకా పనులు చేశాడు. సినిమా పోస్టర్లు, దుకాణాల బోర్డులపై ఉన్న అక్షరాలను చూసి, అక్షరాలపై మక్కువ పెంచుకున్నాడు. స్వయంగా విద్య నేర్చుకున్నాడు. కాస్తంత అక్షర జ్ఞానాన్ని సంపాదించాడు. మెల్లగా చదవడం రాయడం ప్రారం భించాడు. సాహిత్యం చదువు కోవడం మెదలుపెట్టి, చివరకు తనే రచయిత అయ్యా డు.
జీవితకాలంలో తాను 100కు పైగా రచనలు చేశా డు. వాటిలో నవలలు, చిన్న కథల సంకలనాలు, నాటకాలు ఉన్నాయి. తన రచనల్లో శ్రామిక, దళిత, అణగారిన వర్గాల జీవితాలను, కష్టాలను, పోరాటాలను అక్షరబద్ధం చేశాడు. అప్పటి సమాజంలో నెలకొన్న అసమానతలను, అన్యాయాలను తన రచనల ద్వారా కళ్లకు కట్టాడు. ఆయన రచించిన ‘ఫకీరా’ నవల దళితుల పోరాట గాథకు దర్పణం.
దళిత సాహిత్యంలోనే అదో ఒక గొప్ప రచన. ఈ నవలను బీఆర్ అంబేద్కర్‌కు అంకితమిచ్చాడు. తొలిరోజుల్లో కమ్యూనిస్ట్ భావాల వైపు మొగ్గు చూపిన సాఠె, తర్వాత.. దళిత వర్గాల విముక్తి కోసం అంబేద్కరిజం వైపు మళ్లారు. ఈ మార్పు ఆయన రచనల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
అన్నాభావు సాఠె రచనలు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన రచనలు రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, చెక్, ఇంగ్లీష్ వంటి 27 ప్రపంచ భాషల్లో అనువాదమయ్యాయి. అలాంటి మహారచయిత 19 జూలై 1969లో కన్నుమూశారు. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల ఆవిర్భావ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషిం చాడు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. ఆయన పేరుతో తపాలా బిళ్లను సైతం విడుదల చేసింది.
గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్
మాంగ్ సమాజ్ తెలంగాణ అధ్యక్షుడు