calender_icon.png 13 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హృదయాన్ని కరిగించే ‘స్పర్శలేని శిల’

10-11-2025 12:00:00 AM

‘స్పర్శలేని శిల’ అనే కవితల సంకలనంలో కవయిత్రి లహరి తన ఆత్మాన్వేషణ, సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబించారు. చక్కటి భావవ్యక్తీకరణతో కవిత్వాన్ని అల్లారు. ఆమె కవితల నిండా మానవత్వపు పరిమళాలున్నాయి. మమకారపు వెల్లువలున్నాయి. వాటిని చదివే పాఠకుడి మనసును కదిలించడమే కాక, జీవిత విలువలను గుర్తుచేస్తాయి. పుష్పాల సుగంధం, పక్షుల కిలకిలరావాలు ఆమె వర్ణనలో జీవం పోసుకుంటాయి.

కొన్ని పంక్తులు ప్రకృతి దృశ్యాలను మన కళ్లకు సాక్షాత్కరిస్తాయి. పాఠకుల హృదయాలను పరవశింపజేస్తాయి. ఒక్కో కవిత ఒక్కో ప్రపంచాన్నీ సృష్టించి, కలల సౌరభాలను చిమ్ముతుంది. కవితల్లో ప్రేమ, విషాదం, సంతోషం.. ఇలా అన్నిర కాల భావోద్వేగాలు ఆమె అక్షరాల్లో కదలాడాయి. సమాజానికి ఆలోచనల సౌరభాలు అందిస్తాయి. కవితలు ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలుస్తాయి. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’లోని సామాజిక వ్యంగ్యం, దేవు లపల్లి కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’లోని మృదు మధుర భావాలు ఆ పంక్తుల్లో ‘చల్లటి మాటల లేపనం’లా ఉంటాయి.

‘ఒకప్పుడు బ్రతుకుల్ని మార్చిన ఓటు /ఇప్పుడు అమ్మకపు సరుకు/ సారా సీసాలు ,పచ్చనోటుకు బానిస /ఆదమరచిన మత్తులో మైమరచి వేసిన ఓటు/ కాలం సర్పమై కాటేస్తుంది’ అంటూ కవయిత్రి ఓటు విలువను చాటిచెప్తారు. ‘అనాథలా మిగిలిన ఊరు/ కూలిపో యిన/ అరుగులతో కాసేపు మాట్లాడి నిద్రపోతుంది’ అంటూ ఒక కవితలో గ్రామీణ జీవితాల విధ్వంసాన్ని వివరిస్తారు. ఇలాం టి భావాలతో ఆమె సామాజిక, భావోద్వేగ ఇతివృత్తాలను ప్రతిఫలించారు.

‘నీవల్ల కాదని వెక్కించిన నాల్కలు’ అనే వాక్యంలో సమాజం తాలూకు విమర్శనాత్మక స్వభావాన్ని చిత్రీకరించారు. ‘ఆరిపోతున్న మా గుండె తలుపులో/ఊపిరికి కాసింత చము రు పోస్తావేమోనని/ ఎదురుచూస్తున్న మీ అమ్మానాన్న’అంటూ తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఎదురుచూస్తున్న విధానాన్ని కవయిత్రి వర్ణించారు. తల్లిదండ్రులు బిడ్డలపై ఎంతటి ప్రేమను పెట్టుకుంటారో ఆమె ఈ కవిత ద్వారా తెలిపారు.

‘భూమిపై జ న్మించినందుకు/ మన చుట్టూ ఉన్న సమాజం కోసం/ నా దేశపు ఆకలి తీర్చడానికి/అన్నం సృష్టించే యంత్రన్నావుతాను/  కురవని వర్షం కోసం/అమ్మ చనుబాల కోసం/ ఏడ్చే పసిపిల్లవా డినవుతాను/ పట్టెడు అన్నం కోసం పాకులాడే/ నిరుపేద కడుపులకు/ఆపన్నహస్తమవుతాను’ అంటూ కవయిత్రి ఒక కవయిత్రి ఒక కవితలో రాశారు. కవయిత్రి భావ వ్యక్తీకరణ సరళంగా కనిపించినప్పటికీ లోతు గాఢమైనది.

ప్రతి కవిత ఒక అనుభవాన్ని, ఒక సందేశాన్ని అందిస్తుంది. ‘ఈ నేలను తడిమి చూడు’ వంటి వాక్యాలు హృదయానికి హత్తుకునేలా చేస్తాయి. లహరి ‘స్పర్శ లేని శిల’ కవిత్వం మన మనసుల్లో మంచి అనుభూతిని కలిగిస్తాయి. కవిత్వాన్ని ఇష్టపడే ప్రతి పాఠకు డు చదవాల్సిన పుస్తకం ఇది.

రాము కోలా

98490 01201