26-07-2024 02:30:00 AM
దేవుణ్ణి మనమెందుకు పూజిస్తాం?
కృష్ణమూర్తి: నిజానికి మనం దేవుణ్ణి పూజించడం లేదని నా అనుమానం. (సభలో నవ్వులు.) నవ్వకండి. చూడండి, మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు. మనమే గనక నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ‘పూజ’ అని పిలువబడే ఈ తంతు అస లుండనే వుండదు. మనకు దేవుడంటే భయం. మన హృదయాలలో నెలకొని వున్నది భయం గాని ప్రేమ కాదు. అందువల్లనే దేవుని పూజిస్తున్నాం. గుడి, గుడిలోని పూజ, మెడలోని జందెం వీటితో దేవునికి ఏమీ సంబంధం లేదు. ఇవన్నీ మనిషి తన దర్పానికి చిహ్నంగా ను, భయం వల్ల నిర్మించుకొన్నవి. దుఃఖంతోను, భయంతోను నిండిన వారే దేవుని పూజిస్తారు. ఐశ్వర్యం, అంత స్తు, అధికారం గలవారు సుఖజీవులు కారు. తృష్ణాపరులు (పేరాశలు పెట్టుకొ న్నవారు) అత్యంత దుఃఖజీవులు. వాట న్నింటి నుండి విముక్తి పొందినప్పుడే సుఖసంతోషాలు సిద్ధిస్తాయి.
అప్పుడు మీరు దేవుణ్ణి పూజించరు. అతి దీనులు, అత్యంత పీడితులు, నిరాశా పూరితులు మాత్రమే గుడి సన్నిధికి చేర తారు. కానీ, ఈ పూజ అనే తంతును వదిలి పెట్టి తమ దైన్యాన్ని తామర్థం చేసు కొంటే అప్పుడు వారు, స్త్రీలుగాని, పురు షులుగాని సుఖమయ జీవితాన్ని గడుపు తారు. దానికి కారణమేమంటే వారప్పుడు సత్యాన్ని అంటే దేవుని -దర్శింపగలరు.