28-04-2025 12:00:00 AM
ఆకుపచ్చని లోయలో
నిలువెత్తు విషసర్పాల సంచారం
మతం ముసుగేసుకున్న ఉన్మాదాన్ని చూసి
ప్రపంచమే నివ్వర పోతున్నది!
సర్పయాగం ఒకటి మొదలుపెట్టందే
కునుకు లేని జీవితానికి స్వస్తి పలకలేము!
లేత ఇల్లాలు రోదన చెవుల్లో
నిద్ర స్థితిలోనూ మారుమోగుతున్నది
కళ్ళముందే తండ్రిని వివస్త్రుని చేసి
నిలువునా కాల్చేస్తుంటే
ఆ పసిగుడ్డు విహ్వలత్వం
ముద్ద నోట్లో దిగనివ్వడం లేదు!
ఉదారవాదానికి చెల్లు చీటీ రాయందే
దేశ సరిహద్దులు తలెత్తుకోలేవు
సామరస్యం సకలజనుల సౌభాగ్యం
నా బోటివాళ్లకు వాంఛనీయమే!
చీడ పురుగులను ఏరిపారేయందే
నా వాంఛిత కల నెరవేరదు
బిడ్డలను పోగొట్టుకున్న దేశానికి తెలుసు
ప్రతీకారేక్ష ఎంత అవశ్యమో!
వాడు సవాలు విసిరుంటే బాగుండేది
మూతోడ్ జవాబు చెప్పేవాళ్ళం
కుట్రలకు తెరదీశాడు కనికరమక్కరలేదు!
తేరుకున్న దేశం ఒక్కటై నిలిచింది
మనం ఈసారి కొట్టే దెబ్బకు
హిమాలయాల ఆవల
సువిశాల శ్మశానాలే విస్తరించాలి!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి