calender_icon.png 27 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల ఉద్యమ కెరటం

27-09-2025 12:00:00 AM

నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి :

పట్టుదల, త్యాగం, అంకితభావం, ఉద్యమ స్ఫూర్తి, పాలనా దక్షత, విలక్షణమైన నాయకత్వ లక్షణాల సమ్మేళనమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయన.. పెత్తందారీ, దోపిడి, సామాజిక వ్యవస్థపై తిరు గుబాటు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమానికి అనుగుణంగా హైదరాబాద్‌లో సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు.

హైదరాబాద్ రాష్ర్టం భా రతదేశంలో విలీనం కావాలంటూ ఉద్యమానికి నాయకత్వం వహించి న గొప్ప ధీశాలీ. ప్రజా ఉద్యమంలో పాల్గొన్నందుకు 13 సార్లు అరెస్ట్ వా రెంట్లు వచ్చినప్పటికీ భయమెరుగని ధీరుడు. స్వాతంత్రోద్యమ కాలంలో 1941లో మహాత్మా గాంధీతో కలిసి ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా 1947--48 మధ్య కా లంలో ఉద్యమానికి నాయకత్వం వహించారు.

నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కొండా ల క్ష్మణ్ 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబు విసిరిన నారాయణ రావు పవార్ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. 1952--69 మధ్య కాలంలో జరిగిన నాన్ ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉ న్నంత కా లంలో ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యే యంగా బతికిన ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృ ష్టించారు.

తెలంగాణ సాధన సమితిలో క్రియాశీలక సభ్యుడైన ఆయన నవంబర్ 2, 2008న తెలంగాణ రా ష్ర్ట హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ (2009--12) కీలక పాత్ర పోషించారు. చలిని సైతం లె క్కచేయకుండా 97 సం వత్సరాల వయస్సులో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చే సిన నిఖార్సున తెలంగాణవాది బాపూజీ. ఇక బీసీల కోసం అహర్నిశలు శ్ర మించిన ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజీ.

బొజ్జం నరసింహులు సహకారంతో 1950 సంవత్సరంలో బీసీల కోసం ప్రత్యేక సంఘాన్ని స్థా పించి బలహీన వర్గాల ఉద్యమానికి కృషి చేశారు. వెనుకబడినవర్గాల స్థితిగతులను మెరుగుపరిచేందుకు నియమించిన ‘కాక -కాలేల్కర్’ కమిషన్ రా ష్ర్ట పర్యటన సందర్భంగా కొండా లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. అనంతరాము కమిషన్, మురళీధర్ కమిషన్‌లు బీసీల కోసం చేసిన సిఫార్సుల అమలుకై.. సర్దార్ గౌతు లచ్చన్నతో పాటు అనేకమందిని ఒక చోటుకు చే ర్చి 1986లో తిరుపతి లో బీసీ సభను ఏర్పాటు చేశారు.

సభ విజయవం తం కావడం, బీసీల పట్ల చేస్తున్న కృషికి గుర్తుగా కొండా లక్ష్మణ్ బాపూజీ కి ‘ఆచార్య’ అనే బిరుదును ప్రధానం చేశారు. ఆయన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం 2014లో హైదరాబాదులోని ఉద్యాన విశ్వవిద్యాల యం పేరును.. ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం’గా మార్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక వర్గం ఆయన పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అసవరం ఎంతైనా ఉంది. జోహార్ బాపూజీ.

                                                         కామిడి సతీశ్ రెడ్డి