calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

24-09-2025 12:12:27 AM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):  ప్రజల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రెయినేజీ  నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు సరైన రీతిలో అర్హులకు అందేవిధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ యామ రాములు, సొసైటీ ఛైర్మన్ ఇంగు రాములు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బోయిని శంకర్, సీనియర్ నాయకులు బస్వరాజ్ పటేల్, శశికాంత్, సందీప్, రఘు, కాంత్ రెడ్డి, గంగారం తదితరులు పాల్గొన్నారు.