30-12-2025 12:00:00 AM
నాలుగు నెలల నుంచి దొరకని ఆచూకీ, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
గోపాలపేట, డిసెంబర్29: ఓ యువతి నాలుగు మాసాల నుంచి తన ఆచూకీ తెలియక తల్లిదండ్రుల రోదనలు గ్రామంలో అలుముకున్నాయి. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రానికి చెందిన యాప చెట్టు బాలమ్మ భర్త గట్టయ్య వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు నాగలక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది కాగా గత నాలుగు నెలల క్రితం నాగలక్ష్మి వనపర్తికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. ఆనాడు రాత్రి అయిన ఇంటికి తిరిగి రాలేదు.
బాలమ్మకు సంబంధించిన బంధువులందరినీ ఊళ్లల్లో గాలించారు నేటికీ తన కూతురు ఇంటికి రాలేదు. వస్తుందిలే నని ఎదురుచూసిన నాలుగు నెలల అయినా ఇంటికి రాకపోవడంతో సోమవారం నాగలక్ష్మి తల్లి బాలమ్మ తండ్రి గట్టయ్యలు స్థానిక గోపాల్పేట పోలీస్స్టేషన్లో తన కూతురు ఆచూకీ తెలపాలని కోరారు. ఎస్త్స్ర నరేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని తెలిపారు.