29-12-2025 12:00:00 AM
తమిళ తిరుప్పావైలో అందమైన తెలుగు పదాలెన్నో ధనుర్మాసనం -మార్గళినెల చదువుకోవాల్సిన తిరుప్పావైలో అనేక తమిళ పదాలు తెలుగు పదాలే తెలియదు. ఈ తెలుగు అర్థాలు చూడండి.. ఎంత బాగుంటుందో! మన మార్గళి తిరుప్పావై మొదలై ఇప్పడికి పదిరోజులైంది. ఆ పది పాశురాల్లో ఎంత అందమైన తెలుగు పదాలున్నాయో కదా!
కృష్ణశబ్దవాచ్యపు ఆనందమును లేపిన తల్లి గోదమ్మ
కృష్ అంటే అపరిమితిము: ణ అంటే ఆనందము
నీలాతుంగస్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
ముద్బోధ్య కృష్ణం
ఈ అద్భుతమైన శ్లోకం పరాశర భట్టరు, రామానుజుని శిష్యుడు, రచించారు. అర్థం అద్భుతం. చూడండి, నిద్రిస్తున్న కృష్ణ సింహాన్ని గోదమ్మ మేల్కొల్పినది. తన తులసీలతో, పూలతో బంధించినదీ ఆండాళ్. ఆ బంధనంతో బలాత్కారంగా అనుభవించింది. అంటే మనకు తెలసిన బలాత్కారం కాదు. ఆమెను వివాహం చేసుకొనక తప్పలేదని స్థితి వచ్చిందని అర్థం. (తిరుప్పావై తెలుగ రచనలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామినుండి ఈ శబ్దాలు తెలుసుకున్నారు. రాసుకుంటున్నాను, ఇది నా రచన కాదు. నిజానికి గోదమ్మ మూల రచయిత. అని అప్పలాచార్య స్వామి స్పష్టంగా వివరించారు. అయినా శ్రీభాష్యం గారి రచనను మించిన వ్యాఖ్యానం లేదని నాకనిపిస్తూ ఉంటుంది.)
ఆ ఆనందాంశము నీలాదేవి శక్తితో వొదిగినది. శ్రీభాష్యంగారు తత్వాన్ని ఇంకా అద్భుతంగా వివరిస్తున్నారు. కాని రాయడం కూడా కష్టమే. నీలాదేవి ఎవరు, ఏవిధంగా శ్రీకృష్ణుడిని వివాహం సాగిన పద్ధతి ఏమిటి అంటే తిరుప్పావై పాశురాలలో వివరించింది. పామాలై పూమాలై అని గోదమ్మ వ్యాఖ్యానించారు. పామాలై పాశురాల మాల, పూమాల అంటే మనకు తెలుసు. శ్రీరంగనాథుడు, వేంకటాచలపతి, వటపత్రశాయి, శ్రీకృష్ణ అంటే ఒకరే అవన్నీ వివరణచేసే తత్వం ఇది.
30 పద్యాలలో మొదటి పాశురం లో తెలుగు పదాలు, తమిళ పదాలలో పోలికలు అర్థాలు కనపడుతూ ఉంటాయి. మార్గళి అంటే మార్గశీర్ష/ నిఱైన్ద అంటే నిండు చందురుడు/ నన్దగోపన్ అంటే నందగోపుల/ కుమరన్ అంటే కుమారుడు (శ్రీకృష్ణుడు) /అశోదై యశోదై/ శింగమ్ అంటే సింహం/ ముగత్తాన్ అంటే ముఖం/ నారాయణనే అంటే నారాయణుడే/ నమక్కే అంటే మనకే ఎన్ని పదాలు తెలుగులో ఉన్నాయో కదా. ఇవి చదువుకుంటే, ఇతర తమిళ పదాలను కూడా తెలుసుకుంటే గోదమ్మ మొదటి పాశురాన్ని అర్థం చేసుకోవచ్చు.
వైయత్తు
పార్కళుల్ కడలి- పాలు, సముద్రం: పరమన్ పరాత్పరుడు: ఆడి పాడి-పదాలను పాడి, నెయ్యుణ్ణోమ్- నేతిని ఆరగించని, పాలుణ్ణోమ్ -పాలు తాగ కుండా, నీరాడి స్నానం చేసి, శెయ్య - చేయడం, శయ్యోమ్ చేయకుండా నెలవానలు కురిసేనురా ఉత్తమన్ =పురుషోత్తముడైన పరంధాముని: పేర్ = తిరునామాలను, పాడి= స్తుతిస్తూ: నీర్ ఆడినాల్ =స్నానం చేస్తే: ముమ్మారి పెయ్దు=మూడు వాన లు కురుస్తాయి: కణ్-పడుప్ప= నిద్రిస్తూ ఉంటే: పెరుం పశుక్కళ్= పెద్దగా పెరిగిన పశువులను: పద్మనాభుడా రక్షించు: నీ = నీవు: పర్పనాబన్ కైయిల్ = పద్మనాభుని దక్షిణ హస్తమందున్న: శార్జ్ఞ్గ =పరమాత్ముడి విల్లైన శాజ్ఞ్గమ్: శరమళైపోల్ =వేగంగా కురిపించి బాణముల వర్షం వలె: మార్గళి నీరాడ = మార్గళి స్నానం.
మణిదీపమైన
పెరునీర్ = మహాజలప్రవాహముగల: యమునైత్తుఱైవనై= యమునానదీ: వడమదురై మైందనై =ఉత్తరమధురానగర నాయకుడైన: మణి విళక్కై= మణిదీపమైన: దామోదరనై= దామోదరుని: మనత్తినాల్ = మనస్సుతో, శిందిక్క=చింతించి: శేప్పే= పరమాత్ముడిని నామములను కీర్తించే.
శకటాసుర వధ
కోయిలిల్ =కోవెలలో: విళి శంగిన్ =ఆహ్వానిస్తూమోగే శంఖపు, పేరరవం= పెద్ద శబ్దమును కూడా కళ్లచ్చగడం =కృత్రిమ శకటపు: క్కాలోచ్చి=కాలుచాచి ధ్వంసం: మునివర్గళుం =మునివరులు, యోగిగళుమ్ = యోగి వరులు, మెళ్ల = మెల్లగా: అరి ఎన్ఱ = హరి హరి హరి అనే ముందు పక్షులు అరుస్తున్నాయి.
తరువాత మాట్లాడుతున్నాయి. కీశు కీశెన్ఱు= కీచుకీచుమని: పేశిన =మాట్లాడిన: పేచ్చు అరవం = మాటల ధ్వని: కలకలప్ప=గలగలమని చప్పుడు చేస్తూ: తయిర్ అరవం = పెరుగు ధ్వనిని: నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!= ఓ నాయకురాలా: మూర్‌త్తి = కృష్ణరూపంలో మనముం దున్నవాడు: కేశవనై= కేశవుడనే రాక్షసుని చంపిన వాడు: ప్పాడవుం= కీర్తిస్తూ ఉంటే: నీ =నీవు: తిఱ= తలుపు తెఱువు తల్లీ.
చాణూర ముష్టికుడ సంహారి
శిఱువీడు= చిన్నమేత, మిక్కుళ్ల= మిగిలిన: పిళ్ళైగళుం= పిల్లలునూ: పోవాన్=పోవుటయే: వందు = వచ్చి: పాడి = గానము చేయుచూ, పఱై =పఱై అనెడి వాయిద్యమును: వాయ్ =నోటిని, పిళన్దానై=చీల్చినవానిని: మల్లరై = చాణూరుడు, ముష్టికుడు అనే మల్లురను: మాట్టియ= మట్టి కరిపించిన: దేవాదిదేవనై= దేవతలందరికి ఆరాధ్యుడై న శ్రీకృష్ణుని: శేవిత్తాల్ =నమస్కరించినట్లైతే: మాదవన్=మాధవుడా, వైకుంఠవాసా: చుట్రుం= చు ట్టూ.. అంతటా, ధూపం కమఝ=సుగంధ ధూపా లు వ్యాపిస్తుండగా: మామాన్ మగళే=మామకూతురా: మణిక్కదవమ్=మణులతో నిర్మించిన తలు పు: తాళ్=గడియను: తిఱవాయ్=తెరవవోయ్, మామీర్ = ఓ అత్తా: చ్చెవిడో=చెవిటిదామాయన్=మహామాయావీ, మాదవన్=మాధవుడా, వైగుం దన్= వైకుంఠవాసా!
తల్లీ తలుపు తీయమ్మా..
నోట్రు= నోము నోచి: సువర్గమ్ పుగుగిన్ఱ = స్వ ర్గాన్ని ప్రవేశిస్తున్నంత సుఖాన్ని ఎడతెగక అనుభవిస్తున్న, అమ్మనాయ్= అమ్మా తిఱవాదార్= తీ యని వారు: మాట్రముమ్ తారారో= ఒక బదు లు మాటైనా మాట్లాడరా: నారాయణన్=నారాయణుడు అనే దివ్యనామాంకితుడు: పుణ్డియనా ల్= పుణ్యస్వరూపుడైన శ్రీమహావిష్ణువుచే: కుంబకరణనుమ్, కుంభకర్ణుడును, తేట్రమాయ్ వందు= నిద్రమత్తును వదిలిచుకొని వచ్చి: తిఱ=తలుపు తీయి: మనకు భాషలేదని బాధపడవలసిన అవస రం లేదు. రెండు భాషాల్లో ఈ పదాలు పరిచయమైతే, దాదాపు సగం తిరుప్పావై అర్థమవుతుంది.
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్