calender_icon.png 11 January, 2026 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీపడే ప్రసక్తే లేదు

10-01-2026 12:58:41 AM

  1. కృష్ణా, గోదావరి నదీజలాలలో చుక్క నీటిని వదులుకోం
  2. బలమైన వాదనలు వినిపించి నీటి వాటా సాధిస్తాం 
  3. రానున్న మూడేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తాం 
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, జనవరి 9 (విజయక్రాంతి): తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేదిలేదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడ పట్టణం లో శుక్రవారం పలు పనుల పురోగతిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి పరిశీలించి వాటి ని వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కోదా డ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ, కృష్ణా నది నీటి పంపకాల్లో గత ప్రభుత్వం తెలంగాణకు 34 శాతం 299 టీఎంసీలు, ఆంధ్రకు 66 శాతం 512 టీఎంసీలు అంటూ గతంలో అంగీకారం చేసుకోవటం వల్ల ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు నష్టపో యాయని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచి కృష్ణ జలాల్లో 71 శాతం తెలంగాణకు దక్కేలా పోరాడుతున్నామని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో నీటి పారుదల రంగానికి 1.83  లక్షల కోట్ల కేటాయించినప్పటికి కృష్ణ నదిపై తలపెట్టిన పాలమూరు  కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొడంగల్ నారాయణపేట, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయలేదని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్ట్ లు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వచ్చే మూడు సంవత్సరాల్లో కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన ని ర్వాహకం వల్ల నష్టపోయిన కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని వాటా కోసం సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభు త్వం, కేంద్ర జల సంఘం, నది ట్రిబ్యూనల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని తెలిపారు. రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, డివిజన్ కా ర్యాలయం, రూ.4 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు బిల్డింగ్, రూ.5.10 కోట్లతో నిర్మిస్తున్న ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు.

కోదాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రెడ్లకుంట, శాంతినగర్ ప్రాజెక్ట్‌లు వేగవంతంగా పూర్తి చేయాలని, పాలేరు వాగుపై చెక్‌డాం, పాలవరంలిఫ్ట్ ఇరిగేషన్‌కు, నడిగూడెంలోని చౌద రి చెరువు వద్ద బ్రిడ్జికి ప్రతిపాదనలు పంపాలన్నారు. చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్‌పై డబుల్ బ్రిడ్జ్,పాలే అన్నారంలో బ్రిడ్జ్ పనులు త్వరగా ప్రారంభించి ఎండాకాలం చివరినాటికి పూర్తిచేయాలని ఆదేశిం చారు. మోతే లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణకు రైతులకు  నష్టపరిహారం అందించాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈ సమావేశంలో కలె క్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఇరిగేషన్ సీఈ రమేష్‌బాబు, ఎస్‌ఈలు నాగభూషణం, శివతేజ, అధికారులు పాల్గొన్నారు.