calender_icon.png 24 December, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు

24-12-2025 12:58:24 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి శంకుస్థాపన చేసిన అనతికాలంలోనే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం 59వ డివిజన్ పరిధిలోని కనకదుర్గ కాలనీలో 74 లక్షల10 వేల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపడేలా ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు అమలు చేస్తున్నామని, ప్రతి డివిజన్లో అవసరమైన పనులను గుర్తించి వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఈ.వి శ్రీనివాసరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నా యిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, డివిజన్ ఇంచార్జ్ కేతిడి దీపక్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పూరెల్లి రవి కిరణ్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ శ్రేణులు మండల సమ్మ య్య, సుదర్శన్ రెడ్డి, తాళ్లపల్లి రవీందర్ (జె.కె), దొంగరి శ్రీనివాస్, తేల్ల సుగుణ కిషోర్, జనగాం శ్రీనివాస్, బుస్సా నవీన్ కుమార్, కాలనీవాసులు, ప్రజలు,  తదితరులు పాల్గొన్నారు.