22-06-2025 12:00:00 AM
ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా అక్కడ సాయం కోరుతూ భారతీయులు తమను రక్షించమని స్వదేశానికి తరలించమని మన దేశ విదేశాంగశాఖపై ఒత్తిడి చేయటం పెరుగుతోంది. అది -గాజా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, చైనా, బ్యాంకాక్, మలేషియా, ఉక్రెయిన్, రష్యా, ఆఫ్రికా దేశాలు, గల్ఫ్ ఇలా మరే దేశమైనా కావచ్చు. అక్కడికి మన వాళ్ళు చదువుల నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో వెళుతున్నారు.
వారిని తిరిగి భారత్ తేవటానికి ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తున్నారు. భారతదేశం సువిశాల దేశం. ఎన్నో వనరులకు నిలయం. మానవ వనరులకూ కొదవ లే దు. అయినా, వలసలు మన దేశం నుంచి ప్రపంచంలోని అతిచిన్న వెనుకబడిన దేశానికి సైతం జరుగుతున్నాయి. వారంతా ఎందుకి లా వలసలు వెళుతున్నారో ఇప్పటికైనా ఒక అధ్యయనం జరగాలి.
కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రబాద్